మహిళ పట్ల వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన: కాల్పులు

పబ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు విక్రమ్ కుమార్ కరోడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వెర్సోవా ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందని చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. పబ్‌కు వచ్చిన విక్రమ్ కుమార్ ప్యాట్రన్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళ పట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని ఆమె పబ్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మేనేజర్ జితేందర్ ఝా(38).. విక్రమ్ కుమార్‌ను నిలదీశాడు. ఆగ్రహానికి గురైన విక్రమ్ అతనిపై కాల్పులు జరిపాడు.
అక్కడే ఉన్న పబ్ సిబ్బంది నిందితుడు విక్రమ్ కుమార్‌ను పట్టుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు విక్రమ్‌ను అరెస్ట్ చేశారు. హత్యానేరం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ భరాంబే తెలిపారు.












Click it and Unblock the Notifications