బాలీవుడ్ నటి అంటూ స్టార్ హోటల్ లో లూటీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువతి తాను నటిని అంటూ ఓ వ్యాపారవేత్తను డిన్నర్ లో కలిసి రూ, 40 లక్షల విలువైన వాచ్, లక్ష రూపాయల నగదు లూటీ చేసి మాయం అయ్యింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్ లో ఆ యువతి తన చేతివాటం చూపించింది. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ముంబై వ్యాపారి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఐదు నక్షత్రాల హోటల్ బసచేశారు.
బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్న ఆ యువతి ఐదు నక్షత్రాల హోటల్ లో డిన్నర్ లో ఆ వ్యాపారిని కలవడానికి రాత్రి వెళ్లింది. తాను బాలీవుడ్ నటి అంటూ ఆయనను నమ్మించింది. అర్దరాత్రి వరకు ఇద్దరు డిన్నర్ లోనే చర్చించుకున్నారు.

మరునాడు కలుద్దామని ఆ వ్యాపారి ఆమెకు చెప్పాడు. ఉదయం 7 గంటలకు తన గదిలో నిద్రలేచి చూసే సరికి రూ. 40 లక్షల విలువైన వాచ్, పర్స్ లో ఉన్న రూ. ఒక లక్ష మాయం అయ్యిందని గుర్తించారు.
హోటల్ సిబ్బందిని పిలిచి విచారించగా మీతో ఉన్న మహిళ వేకువ జామున గదిలో నుంచి బయటకు వెళ్లిపోయారని చెప్పారని, ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ వ్యాపారికి ఢిల్లీలో సొంత ఇల్లు ఉందని పోలీసులు గుర్తించారు. తన వ్యాపార భాగస్వాములతో చర్చించేందుకు తాను హోటల్ లో బస చేశానని అతను చెప్పాడని పోలీసులు అన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications