వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై కేఈఎం ఆసుపత్రి జలమయం: రోగుల అగచాట్లు, నేల మీద చికిత్స, తీవ్రగాయాలు !

ముంబైలో జలమం అయిన ప్రముఖ కేఈఎం ఆసుపత్రి పై అంతస్తులకు రోగులు, పడకలు లేక నేల మీద చికిత్స కుప్పకూలిపోతున్న హోర్డింగులు, తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Mumbai Municipal Corporation Mayor's Post : BJP OR Shiv Sena - Oneindia Telugu

ముంబై: ముంబైలో భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి మద్యాహ్నం 2.30 గంటల మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 100 మి,మీ. వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

ముంబైలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత చర్యగా అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.

ప్రముఖ ఆసుపత్రి జలమయం

ప్రముఖ ఆసుపత్రి జలమయం

ముంబై నగరంలోని పెరేల్ ప్రాంతంలోని కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లోకి భారీగా వర్షం నీరు చేరిపోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రొగులకు చికిత్స చెయ్యడానికి సైతం ఆసుపత్రి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.

పై అంతస్తుల్లో పడకలు లేవు

పై అంతస్తుల్లో పడకలు లేవు

కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో చికిత్స పొందుతున్న రోగులకు పై అంతస్తులకు తరలించారు. పై అంతస్తుల్లో రోగులు ఉండటానికి పడకలు లేకపోవడంతో వారికి నేల మీద చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా చలి ఎక్కవ కావడంతో రోగులు వణికిపోతున్నారు.

రోగులకు దుప్పట్లు లేక !

రోగులకు దుప్పట్లు లేక !

ఒక్క సారిగా వర్షం నీరు కేఈఎం ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ లోకి రావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం తెచ్చుకున్న దుప్పట్లు తడిచిముద్ద అయ్యాయి. దుప్పట్లు తడిచిపోవడంతో నేల మీద వాటిని వేసి చికిత్స చెయ్యడానికి అవకాశం లేకపోయిందని వారి బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

వేరే ఆసుపత్రులకు రోగులు

వేరే ఆసుపత్రులకు రోగులు

కేఈఎం ఆసుత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వేరే ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించడానికి వీలుకాకపోవడంతో అక్కడి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. రోగులకు ఎలా చికిత్స చెయ్యాలి అంటూ సతమతం అవుతున్నారు.

కుప్పకూలిన హోర్డింగ్స్

ముంబైలోని వీపీ రోడ్డులో ఎతైన భవనం మీద ఇనుప రాడ్లతో నిర్మించిన అతి పెద్ద హోడ్డింగ్ కుప్పకూలడంతో దాని కింద నిలబడి ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

English summary
As Mumbai receives over 100 mm rain water on Tuesday (August 29th 2017) from 8:30 am to 2:30 pm., water flooded into the Parel's KEM hospital. And at VP road, a advertisement board collapsed on people in which three injured and are shifted to Saifee hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X