బిజెపికి షాక్: శివసేన తరపున హర్థిక్ పటేల్ ప్రచారం, బిజెపికి చెక్ పెట్టేనా?
శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేతో పటేళ్ళ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు హార్థిక్ పటేల్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
ముంబై:ముంబైలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పటేళ్ళ రిజర్వేషన్ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్థిక్ పటేల్ శివసేన తరపున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు హర్థిక్ పటేల్ మంగళవారం నాడు శివసేన అధినేత ఉధ్ధవ్ థాకరేను కలిశారు.
25 ఏళ్ళ మైత్రిని బిజెపితో శివసేన తెగతెంపులు చేసుకొంది. ముంబైతో పాటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ,నవనిర్మాణసేనతో కలిసి పోటీచేయనుంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని చెబుతుంటారు. అయితే బిజెపి అదికారంలో ఉన్న గుజరాత్ లో ఆ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన హర్థిక్ పటేల్ శివసేనకు దగ్గరయ్యాడు.
బిజెపితో మైత్రిని తెగతెంపులు చేసుకొన్న తర్వాత శివసేన చీఫ్ ఉథ్థవ్ థాక్రేతో హర్థిక్ పటేల్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
మంగళవారం నాడు ముంబైలోని తన నివాసం మాతోశ్రీలో ఉధ్ధవ్ థాక్రేను హర్థిక్ పటేల్ కలిశారు. శివసేన వ్యవస్థాపకులు
బాల్ థాక్రేకు నివాళులర్పించేందుకు హర్థిక్ పటేల్ వచ్చినట్టుగా శివసేన యువజన విభాగ అధ్యక్షుడు ఆదిత్య థాక్రే ట్వీట్ చేశారు.

ముంబై తో పాటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో గుజరాతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో హార్థిక్ పటేల్ శివసేన తరపున ప్రచారం చేయనున్నారని ప్రచారం సాగుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ హర్థిక్ పటేల్ శివసేన తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే తాను బాల్ థాక్రే అభిమానినని, ఆయనకు నివాళులర్పించేందుకే వచ్చినట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications