Porn Racket Case : ఎట్టకేలకు రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు-బలిపశువును చేశారన్న కుంద్రా లాయర్
పోర్న్ రాకెట్ కేసులో రెండు నెలల క్రితం అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త,సినీ నిర్మాత రాజ్‌కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుపై ముంబై కోర్టు కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్‌కుంద్రాతో పాటు ఆయన కంపెనీల్లో ఒకదానికి ఐటీ హెడ్‌గా వ్యవహరిస్తున్న ర్యాన్ థ్రోప్‌కు కూడా బెయిల్ మంజూరైంది.
రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌పై సోమవారం(సెప్టెంబర్ 20) ముంబై కోర్టులో విచారణ జరగ్గా... ఆయన తరుపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపించారు.'కంటెంట్ అప్‌లోడ్ అనేది రాజ్‌కుంద్రానో,ర్యాన్ థ్రోపో నిర్ణయించేది కాదు.కుంద్రాపై దాఖలు చేసిన 1400 పేజీల చార్జిషీట్‌లో అశ్లీల కంటెంట్ ఆయనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు.' అని పేర్కొన్నారు. రాజ్‌కుంద్రాను తప్పుడు కేసులో ఇరికించి బలిపశువును చేశారని ఆరోపించారు.ఎఫ్ఐఆర్‌లో రాజ్‌కుంద్రా పేరు కూడా లేదని... అయినప్పటికీ పోలీసులు అతన్ని ఈ కేసులోకి లాగారని ఆరోపించారు.

గత గురువారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో రాజ్‌కుంద్రాపై చార్జిషీట్ దాఖలు చేయగా... శనివారం అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.గతంలో హైకోర్టు రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే.తాజాగా ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజ్‌కుంద్రాకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఇవాళ లేదా రేపు ఆయన జైలు నుంచి విడుదలవుతారని కుంద్రా న్యాయవాది తెలిపారు.
ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో రాజ్‌కుంద్రా భార్య,హీరోయిన్ శిల్పాశెట్టి సహా 43 మంది సాక్షుల వాంగ్మూలాన్ని పొందుపరిచారు.పోర్న్ రాకెట్ కేసులో వినిపిస్తున్న హాట్‌షాట్స్,బాలీఫేమ్ యాప్స్ గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
అసలేంటీ కేసు :
పోర్న్ రాకెట్ కేసులో ఈ ఏడాది జులైలో రాజ్‌కుంద్రాను పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.పోర్న్ చిత్రాలను నిర్మించడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.ఇందుకోసం కొంతమంది నటీమణులను ట్రాప్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని మద్ ప్రాంతంలోని ఓ బంగ్లాపై పోలీసులు దాడి చేయడంతో ఈ పోర్న్ రాకెట్ వెలుగుచూసింది.ఆ బంగ్లాలో అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరపగా.. ఈ పోర్న్ రాకెట్ వెనక రాజ్‌కుంద్రా కీలక సూత్రధారిగా ఉన్నట్లు వెల్లడైంది. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ఆయన పోర్న్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నారని... తద్వారా భారీగా డబ్బులు సంపాదించారని పోలీసులు గుర్తించారు.
కొంతమంది నటీనటులకు,మోడల్స్‌కు ఇండస్ట్రీలో బ్రేక్ ఇస్తామని ఆశలు కల్పించి రాజ్‌కుంద్రా వారితో పోర్న్ కాంట్రాక్టుపై సంతకాలు చేయించారన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ వాటిపై సంతకాలు చేయకపోతే,అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోతే.. వారికి ఇండస్ట్రీలో బ్రేక్ రాదని బెదిరించేవారని పోలీసులు గతంలో వెల్లడించారు.
పోర్న్ రాకెట్‌పై కొద్ది నెలల క్రితం నటి,కామసూత్ర 3డీ ఫేమ్ షెర్లిన్ చోప్రా పోర్న్ విస్తుపోయే విషయాలు వెల్లడించారు. రాజ్‌కుంద్రా తనను తప్పుదోవ పట్టించి పోర్న్ చిత్రాల్లో నటించేలా చేశారని ఆరోపించారు. గ్లామరస్ వీడియోలని చెప్పి తనతో అగ్రిమెంట్ చేయించుకుని... ఆపై బోల్డ్ చిత్రాల్లో నటింపజేశారని ఆరోపించారు. అంతేకాదు,ఆ వీడియోలు శిల్పాశెట్టికి నచ్చాయని... పోర్న్ వీడియోలు చేయడంలో తప్పేమీ లేదని తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.
-
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..!










Click it and Unblock the Notifications