Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోకాలిలో దోసకాయంత రాళ్ళను తొలగించిన ముంబై వైద్యులు;ఇండియాలోనే తొలిసారి అరుదైన శస్త్రచికిత్స

కిడ్నీలో రాళ్లు వస్తాయని విన్నాం, కడుపులో నుండి పెద్ద పెద్ద గడ్డలు తొలగించినవి విన్నాం .మోకాలి నుండి దోసకాయ పరిమాణంలో రాళ్ళను తొలగించిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. భారతదేశంలో అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు ముంబై ఆసుపత్రి వైద్యులు. 70 ఏళ్ల వ్యక్తి కుడి మోకాలి నుండి దోసకాయ పరిమాణంలోని రాళ్లను తొలగించి, అతన్ని మళ్లీ మామూలుగా నడవగలిగేలా చేశారు.

మోకాలి నొప్పితో ఆస్పత్రికి వెళ్ళిన కార్మికుడికి అరుదైన చికిత్స

మోకాలి నొప్పితో ఆస్పత్రికి వెళ్ళిన కార్మికుడికి అరుదైన చికిత్స

రోగి - లక్ష్మీకాంత్ మధేకర్, అమరావతికి చెందిన కార్మికుడు. కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఒక సంవత్సరం నుండి కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. దీనికి ముందు దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కాళ్ల వాపులతో బాధపడుతున్నాడు. ఇక ఇటీవల కాలంలో మోకాళ్లలో తీవ్రమైన నొప్పితో అతను నడవలేని పరిస్థితి వచ్చింది. మెట్లు ఎక్కాలి అన్నా దిగాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలి అన్నా చెప్పలేనంత ఇబ్బంది చోటు చేసుకుంటుంది. దీంతో అతను ఎస్. ఎల్. రహేజా హాస్పిటల్, మహిమ్ యొక్క కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ్ ఎం. షా ను కలిశారు.

దోసకాయంత సైజులో మొకాలిలో రాళ్ళు

దోసకాయంత సైజులో మొకాలిలో రాళ్ళు

రోగి ఆసుపత్రిలో చేరిన తర్వాత, డాక్టర్ షా పరీక్షలు నిర్వహించి, మోకాలి కీలుకు సంబంధించిన 'మల్టిపుల్ జెయింట్ సైనోవియల్ కొండ్రోమాటోసిస్' అనే అత్యంత అరుదైన పరిస్థితిగా సమస్యను గుర్తించి, మధేకర్‌కు తగిన చికిత్స ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పరిస్థితి ప్రతి 1,00,000 మందిలో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. దీనిలో మోకాలి కీలు లోపలి పొర కందెన ద్రవం యొక్క సాధారణ స్రావానికి బదులుగా మృదులాస్థి యొక్క నాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మాడ్యూల్స్ విరిగిపోతాయి. మోకాలి లోపల వదులుగా మారుతాయి. సాధారణంగా ఇవి రాళ్ళుగా మారి మాత్రల వంటి చిన్నవి లేదా పాలరాయి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. కానీ మధేకర్ విషయంలో, బహుళ, జెయింట్ నోడ్యూల్స్ ఉన్నాయి. పరిమాణంలో మరింత పెద్దవిగా దోసకాయంత సైజులో ఉన్నాయి. ఈ పరిస్థితి చాలా అరుదైన వైవిధ్యం, "అని డాక్టర్ షా చెప్పారు.

 ప్రపంచంలో రెండో అతిపెద్ద మోకాలి రాళ్ళ తొలగింపు.. భారత్ లో మొదటిది

ప్రపంచంలో రెండో అతిపెద్ద మోకాలి రాళ్ళ తొలగింపు.. భారత్ లో మొదటిది


మధేకర్ కు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు మధేకర్ మోకాలి నుండి సేకరించిన అతి పెద్ద రాయి పరిమాణం 12x6x5.5 సెం.మీ ఉందని వెల్లడించారు. దానిని రెండు ముక్కలుగా విభజించి తీసివేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. అతని మోకాలి కీలు నుండి మొత్తం నాలుగు పెద్ద రాళ్ళు మరియు డజన్ల కొద్దీ చిన్న రాళ్లు తీయబడ్డాయని వైద్యులు తెలిపారు. భారతదేశంలో ఎక్కడా మోకాలి కీలు నుండి మోకాలి లోపలి పొరతో పాటు భారీ మరియు బహుళ రాళ్లను తొలగించినట్లు ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక చోట అతిపెద్ద మోకాళ్ల రాళ్ల తొలగింపు జరగగా, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మోకాలి రాళ్ల తొలగింపుగా పేర్కొనబడిందని డాక్టర్ షా పేర్కొన్నారు.

నడవగలుగుతున్నా అన్న రోగి

నడవగలుగుతున్నా అన్న రోగి

మోకాలు నొప్పి నుండి చాలా ఉపశమనం పొందిన మధేకర్ మాట్లాడుతూ, తాను 2010 నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొన్నానని మరియు అతని మోకాలి కీలులో చాలా ద్రవం ఉన్నట్లు భావించానని, ఫలితంగా అతని కదలికలలో వాపులు మరియు అసౌకర్యాలు ఉన్నాయని చెప్పాడు. మొదట్లో, నీటిని ఇంజెక్షన్ ద్వారా తొలగించారు, కానీ అది ఎటువంటి దీర్ఘకాలిక పరిష్కారాలను అందించలేదు. అతని కదలికలను బాగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత అతను ముంబై ఆసుపత్రికి వచ్చి 'మోకాలి-రాయి' తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నానని పేర్కొన్నారు.

Recommended Video

    China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu
    మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ షా..

    మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ షా..

    భారీ రాళ్లను బయటకు తీయడమే కాకుండా, రాళ్ల వల్ల కలిగే ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా మోకాలి కీలు దెబ్బతినడం మరియు కీళ్ల మృదులాస్థికి హాని కలిగించడంతో డాక్టర్ షా మధేకర్‌కు మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కూడా చేశారు. మార్చి 10న శస్త్రచికిత్స జరిగింది మరియు రోగి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతను ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదా అసౌకర్యం లేకుండా నడవగలడని, తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించగలడు అని డాక్టర్ షా చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+