ముంచెత్తుతున్న వానలు - ఈ నెల 31 వరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!!

నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందుగానే వచ్చేసాయి. అటు బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగు తోంది. ముందస్తుగానే రుతుపవనాలు రావటంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఏపీ, తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

రుతుపవనాల ఎఫెక్ట్
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అటు ఢిల్లీలో శనివారం దిల్లీలో బీభత్సం సృష్టించగా, ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలో భారీగా వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవ నాలు సమయం కంటే ముందుగా కేరళ తర్వాత మహారాష్ట్రకు చేరుకున్నాయి. 35సంవత్సరాల తర్వాత రుతుపవనాలు ముందుగా రావడం ఇదే మొదటిసారి. దీంతో ముంబయి, పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి కురిసిన బారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచి పోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేప్టటింది. అయితే రానున్న కొద్ది గంటల్లో ముంబయిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.

mumbai-experienced-heavy-rain-and-thunderstorms-accompanied-by-lightning-and-strong-winds

తాజా అలర్ట్స్
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కర్ణాటకలో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు వర్షాలు కారణంగా మైసూరు కొడుగు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మే 31 వరకు కర్ణాటకలోని పలు జిల్లాలో 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అటు కేరళలోనూ 11 జిల్లాలకు రెడ్ అల్టర్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్​ జారీ చేసింది. కేరళ, తమిళనాడు, మహేలో మే 29వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తాజా హెచ్చరిక
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్. గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం విషయానికొస్తే అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+