ముంబై ఎయిర్‌పోర్టు మూసివేత: విమానాల ఆలస్యం
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై విమానాశ్రయం సోమవారం ఐదు గంటలపాటు మూసివేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి 5గంటలపాటు విమానాశ్రయం మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం సోమవారం సాయంత్రం 5గంటలపాటు ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు, పైలట్లకు ముందుగానే తెలిపారు.

ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు. కాగా, మూసివేత ప్రభావం సాయంత్రం విమాన రాకపోకలపై పడనుంది.
కాగా, ముంబై విమానాశ్రయం నుంచి 1600పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఎక్కువ దేశీయ సర్వీసులు అయితే అక్టోబర్ 18న మొదలైన నిర్వహణ పనులు నవంబర్ చివరి వారంలో ముగుస్తాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications