ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు

ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో 10 మందిని జీటీ హాస్పిటల్లో చేర్చగా... మరో ఆరుమందిని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఛత్రపతి శివాజీ టర్మినస్‌లోని 1వ ప్లాట్ ఫాంతో బీటీ లేన్‌తో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అనుసంధానమైంది.ఈ బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ దారిలో వస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించేందుకుగాను అంబులెన్స్‌లకు దారిని క్లియర్ చేయాలని కోరారు.

Mumbai Footover Bridge Collapse: At Least 2 Dead,34 Injured

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ చిక్కుకున్నవారు కేకలు వేయడం పలువురిని కలచివేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+