వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులో సొమ్మసిల్లిన రేప్ విక్టిమ్ ఫొటో జర్నలిస్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: నగరంలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన 23ఏళ్ల ఫొటో జర్నలిస్టు.. కేసు విచారణ నిమిత్తం స్థానిక కోర్టుకు గురువారం హాజరైంది. కోర్టులో నాలుగు గంటలపాటు నిరీక్షించిన ఫొటో జర్నలిస్టు స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ చెప్పిన వివరాల ప్రకారం.. అత్యాచార బాధితురాలిని వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు తీసుకురాగా ఆమె స్పృహ కోల్పోయిందని, ఆమెకు వైద్య సహాయం అందించాల్సిందిగా కోర్టును కోరినట్లు ఆయన తెలిపారు. కోర్టు అనుమతితో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

Mumbai gangrape

ఆగస్టు 22న ముంబైలోని శక్తి మిల్ కాంపౌండ్ పరిసర ప్రాంతంలో ఫొటో జర్నలిస్టుపై ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతోపాటు వచ్చిన సహోద్యోగిని తీవ్రంగా గాయపరిచి ఆమెపై అత్యాచారం చేశారు. కాగా తన తల్లితోపాటు కెమెరా విచారణలో భాగంగా కోర్టుకు బాధితురాలు గురువారం హాజరయ్యారు. బాధితురాలు జరిగిన సంఘటనను పోలీసులకు, కోర్టుకు పూర్తిగా వివరించిందని ఆయన తెలిపారు. నిందితులు తనకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించారని బాధిరాలు తెలిపినట్లు నిఖమ్ చెప్పారు.

చాలా సేపు నిరీక్షించిన బాధితురాలు అలసిపోయినట్లు గుర్తించి కొంత విరామం కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. అంతలోపే బాధితురాలు స్పృకోల్పోవడంతో ఆస్పత్రికి తరలించామని, ఈ సంఘటనతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా విచారణ సమయంలో నలుగురు నిందితులు తాము చేసిన తప్పును ఎలాంటి పశ్చాత్తాపము వ్యక్తం చేయలేదని తెలిపారు. ఐదుగురు నిందితులలో ఒకరిని నిందితుడిని జువైనల్‌నకు తరలించినట్లు ఆయన తెలిపారు.

నిందితులు విజయ్ జాదవ్, కాసీం బెంగాలీ, సలీం అన్సారీ, సిరాజ్ రెహమాన్ లపై ఛార్జీషీటు, అత్యాచారం, కుట్ర, అసాధారణ శృంగారం, సమాచార సాంకేతిక యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 19న 600పేజీల ఛార్జీషీటును నలుగురు నిందితులపై నమోదు చేశారు.

English summary
The 23-year-old photojournalist in the Mumbai gangrape case today identified her assaulters and fainted inside the court during her four-hour deposition, following which she was taken to a city hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X