• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు ప్రియా వారియార్.. ఇప్పుడు 'సుప్రియా': సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న పోస్టు

|
Google Oneindia TeluguNews

Recommended Video

#SaveSupriya : Priya Varrier Gone, Internet Now Looking For Supriya

ముంబై: సోషల్ మీడియా పుణ్యమాని మంచైనా.. చెడైనా ఈరోజుల్లో క్షణాల్లో వైరల్ అవుతోంది. మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియో దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో.. ఇప్పుడు 'సేవ్ సుప్రియా' అన్న ఓ పోస్టు కూడా అంతే వైరల్ అవుతోంది. ముంబై నుంచి మొదలై బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా, ఇలా అన్ని నగరాలకు ఆ హాష్ ట్యాగ్ వ్యాపిస్తోంది. ఇంతకీ ఏంటీ హాష్ ట్యాగ్ వెనుక కథా కమామీషు..

ఇదీ అసలు విషయం..:

ఇదీ అసలు విషయం..:

ముంబైకి చెంది ఐశ్వర్య శర్మ ఇటీవల అంధేరీలోని ఓ పబ్ కు వెళ్లింది. అక్కడ తన వెనకాలే కూర్చున్న ఇద్దరు యువకులు ఓ యువతి గురించి చేసిన కామెంట్స్ విని షాక్ అయింది.

అందులో అమన్ అనే ఓ యువకుడు.. 'బ్రో.. నేను సుప్రియా కళ్లుగప్పి నిన్న రాత్రి నిధితో వెళ్లాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం' అని మరో స్నేహితుడితో చెప్పడం ఐశ్వర్య చెవిన పడింది. దానికి ఆ స్నేహితుడు 'సూపర్‌ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు' అని బుదలివ్వడంతో మరింత షాకైంది.

'సేవ్ సుప్రియ' మిషన్..:

'సేవ్ సుప్రియ' మిషన్..:

సుప్రియను తాను మోసం చేస్తున్నానన్న సంగతి ఆమె కనిపెట్టలేదని సదరు బాయ్ ఫ్రెండ్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవడంతో.. ఈ విషయం ఎలాగైనా ఆమెకు తెలియాలని ఐశ్వర్య ఫిక్స్ అయింది. ఫేస్ బుక్ లో ఆమె కోసం సెర్చ్ చేసింది. కానీ ఎంతోమంది సుప్రియల్లో ఆమెనే గుర్తుపట్టడం ఎలా?.. అందుకే ఓ నిర్ణయానికి వచ్చింది.. 'సేవ్ సుప్రియ' పేరుతో ఓ హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పోస్టు పెట్టింది.

'నీ బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసెయ్..':

సుప్రియా. నీ బాయ్ ఫ్రెండ్ పేరు గనుక అమన్‌ అయితే వాడితో జాగ్రత్తగా ఉండు. వాడు నిన్ను మోసం చేసి నిధితో తిరుగుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు.

సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్‌ప్రెండ్‌లలో ఎవడైనా అమన్‌ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్‌ చెప్పేయండి. సుప్రియకు చేరేదాకా దీన్ని షేర్ చేయండి..' అంటూ ఐశ్వర్య తన పోస్టులో పేర్కొంది.

క్షణాల్లో వైరల్:

క్షణాల్లో వైరల్:


సుప్రియకు తన బాయ్ ఫ్రెండ్ చీటింగ్ గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఐశ్వర్య మొదలుపెట్టిన ఈ మిషన్ క్షణాల్లో వైరల్ అయింది. కొన్ని వందల మంది దీన్ని షేర్ చేశారు. కొన్ని వేల మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది స్టుపిడీ అని కొట్టిపారేస్తుంటే.. కొంతమంది ఐశ్వర్యకు మద్దతునిస్తున్నారు.

రెస్పాన్స్ చూసి ఉబ్బితబ్బిబ్బయింది..:

తన పోస్టుకు ఇంత భారీ స్పందన చూసి ఐశ్వర్య కూడా షాకైంది. తాను ఆఫీసు నుంచి బయటకొచ్చి ఫేస్ బుక్ ఆన్ చేసేసరికి ఊహించలేనంత స్పందన వచ్చిందని మరో పోస్టులో చెప్పుకొచ్చింది.

తన పోస్టును షేర్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ.. మరి అసలు సుప్రియకు ఈ పోస్టు చేరే ఉంటుందా?

English summary
Mumbai girl Aishwarya Sharma wrote a Facebook post about a conversation she overheard at a popular watering hole in Andheri one evening. A guy was bragging to his friend about ‘ditching’ someone called Supriya for another girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X