రాత్రిపూట సందర్శించేందుకు బెస్ట్‌ ప్లేసెస్‌ ఇవే..! జిల్ జిల్ జిగా జిగా

సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అటు పిల్లలకు వేసవి సెలువులు కూడా ఇచ్చేశారు. దాంతో ఇంటిల్లిపాది ఎటైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? ఎండల నుంచి తప్పించుకుని ఎక్కడికైనా చల్లనైన ప్రాంతాల్లో ఫ్యామిలీతో విహరించాలని ఉందా..? అయితే మీకు నాక్ టూరిజం గురించి తెలుసా..? మనదేశంలోని కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పగలు కంటే రాత్రి అయితేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ టూరిస్టు ప్రాంతాల్లో నైట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ వైపు మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులు, మరోవైపు చల్లని గాలులు ఎటు చూసినా పర్యటకులు, విందు వినోదాలు ఒక్కటేమిటీ నైట్ టూరిజంలో ఫుల్ కిక్కే ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఎండలతో బయటకు వెళ్లాలంటేనే జనాలు బెంబేలెత్తి పోతున్నారు. పగలు పిల్లాపాపలతో కలిసి టూర్ లకు వెళ్లేందుకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాక్ టూరిజం ట్రెండింగ్ లోకి వచ్చింది. నాక్ టూరిజం అంటే నైట్ టూరిజం అని అర్థం వస్తుంది. అంటే రాత్రిపూట పర్యటన. మరి మనదేశంలో రాత్రి పూట టూరిజం చేసేందుకు అనువైన ప్రాంతాలు ఏవి..? వీటిలో ముంబై గురించి మొదటగా చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ కాపిటల్ గా ఉన్న ముంబైలో పగటిపూట కంటే రాత్రిళ్లు ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. ముంబైలో రాత్రి సమయాల్లో మెరైన్ డ్రైవ్ వద్ద కూర్చొని సముద్ర గాలిని ఆస్వాదించడం ఎంతో హాయిగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. అలాగే కొలాబా, బాంద్రా ప్రాంతాల్లో నైట్ కెఫేలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి నైట్ లైఫ్ ను ఆస్వాదించేందుకు దేశవ్యాప్తంగా టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.

ఇక రాజస్థాన్ రాజధాని జైపూర్ పింక్ సిటీగా పేరుగాంచింది. ఎడారి కారణంగా పగటిపూటలో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే రాత్రిళ్లు ఈ నగరం కొత్త అందాలను సంతరించుకుంటుంది. హవా మహల్, అంబర్ కోట లాంటి చారిత్రక కట్టడాలు రాత్రి వేళల్లో వెలుగుల కాంతిలో మెరిసిపోతుంటాయి. రాజస్థానీ సాంస్కృతిక ప్రదర్శనలు, ఫోక్ డ్యాన్స్‌ లు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంటాయి.

Mumbai Goa Jaipur and Udaipur India s Best Cities for Magical Night-Time Tourist Experiences now

ఇక మరో ముఖ్యమైన పర్యాటక ప్రాంతం గోవా.. సాధారణంగానే గోవాలో నిత్యం టూరిస్టులు సందడి చేస్తుంటారు. గోవాలోని బీచ్ లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అలాగే బీచ్ ల వద్ద జరిగే నైట్ పార్టీలు, సంగీత కార్యక్రమాలు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక బాగా, కలంగూట్, అన్జునా వంటి బీచ్ ల వద్ద రాత్రి వేళల్లో ఉత్సాహభరితమైన వాతావరణం కనువిందు చేస్తుంది. నైట్ మార్కెట్లు సైతం పర్యటకులకు విశేషమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+