చట్నీలో టాయిలెట్ వాటర్, వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ (వీడియో)

ముంబై : రుచే కాదు .. శుచి, శుభ్రత ఉంటుందని రోడ్డుపై చేసే టిఫిన్ల అంటే ఇష్టపడతారు జనం. ఎగబడి మరీ తింటారు. దీంతో ఆ పేద యాజమానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చిన వారవుతామని భావిస్తారు. కానీ వారిపై జనం ఉంచే నమ్మకాన్ని కొందరు వమ్ము చేస్తున్నారు. మరోసారి ముంబైలో ఓ టిఫిన్ యాజమాని కస్టమర్ల విశ్వసాన్ని నీటిపాలు చేశాడు.

చట్నీలో టాయిలెట్ నీరు ..
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వీధుల్లో ఇడ్లీ బండీలు కామనే. బోరివెలిలో కూడా ఓ ఇడ్లీ బండి ఉంది. అతను రుచిగా చేయడంతో జనం కూడా ఎక్కువే వస్తుంటారు. కానీ ఆ యాజమాని చట్నీ కోసం మంచినీరు వాడలేదు. బోరివాలి రైల్వేస్టేషన్ టాయిలెట్ నీళ్లను వాడారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్పటికీ ఇడ్లీ తయారుచేసిన అతను .. చట్నీలో కలిపేందుకు నీళ్లకోసం రైల్వేస్టేషన్ వైపు పరుగెత్తాడు. అతనిని అనుసరించిన ఓ వ్యక్తి వీడియో తీస్తే దిమ్మతిరిగే నిజం బయటపడింది. అతను రైల్వేస్టేషన్ టాయిలెట్ కెళ్లి .. అక్కడ నీరు పట్టుకున్నాడు. 45 సెక్లండ్ల నిడివి గల ఈ వీడియోను నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతుంది. దీంతో ఎఫ్ డీ ఏ కూడా స్పందించింది.

Mumbai idli vendor uses toilet water to cook food, probe ordered

వీడియో వైరల్
సోషల్ మీడియాలో ట్రోలవుతున్న వీడియోపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నాని పేర్కొంది. రైల్వేస్టేషన్‌ టాయిలెట్లలో నీరు వాడటం సరికాదని తెలిపింది. దీంతో టిఫిన్ చేసే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించింది. వాంతులు, విరోచనాలు సహా .. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఎఫ్ డీ ఏ అధికారి శైలేష్ అదావ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇడ్లీ తయారుచేసే వ్యక్తిని గుర్తించామని .. అతని లైసెన్స్ ఉందా ? లేదో అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇడ్లీ శాంపిల్ పరీక్షిస్తామని .. వీడియోలో ఉన్నట్టు మంచినీరు వాడకపోయినట్టు తేలితే ఇడ్లీ బండిని సీజ్ చేస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+