మహిళా లాయర్ హత్య: వాచ్‌మెన్‌కి జీవిత ఖైదు

Mumbai lawyer Pallavi Purkayastha's killer sentenced to life
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో యువ మహిళా న్యాయవాది పల్లవి పుర్కయాస్థ హత్య కేసులో నిందితుడైన ఆమె నివాసం ఉండే భవన వాచ్‌మెన్ సజ్జద్ ఎ మొగల్‌‌కు ముంబై కోర్టు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2012లో పల్లవి హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
పల్లవి నివసించే భవన వాచ్‌మెన్ సజ్జద్ ఎ మొగల్ ఆమెను హత్య చేసినట్లు రుజువు కావడంతో ముంబై కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

జాతీయ స్థాయి స్విమ్మర్ అయిన న్యాయవాది పల్లవి వడాలా ప్రాంతంలోని ‘హిమాలయన్ హైట్స్' అపార్ట్‌మెంట్ 16వ అంతస్తులో 2012, ఆగస్టు 9న హత్యకు గురైంది. కాగా, పదే పదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో ఆమెను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆమె ప్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్‌బెల్ మీద రక్తపు మరకలు ఉండటాన్ని గమనిస్తే ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది.

అయితే ఆమె తలుపు వద్ద కనిపించకపోవడంతో వాళ్లు తలుపు తియ్యలేదు. ఇంతలో సజ్జద్ వచ్చి పల్లవి గొంతుకోసి హత్య చేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యాం చెప్పారు. కాగా, నిరుడు నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు. నిందితుడికి జీవిత ఖైదు విధించడం పట్ల బాధితురాలి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+