ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముహూర్తపు షాట్ రోజునే సెట్‌లో ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. సినిమా బృందానికి సభ్యులంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆదిపురుష్‌లో శ్రీరాముడిగా నటిస్తున్న కథనాయకుడు ప్రభాస్, రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ అక్కడ లేరు. కాగా, రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, సినిమా సెట్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. రామాయాణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ లతోపాటు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.