వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుచికరమైన ఆహరం వండటం లేదని విడాకుల పిటిషన్, షాకిచ్చిన కోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:రుచికరమైన ఆహరం వండిపెట్టడం లేదని, ఆలస్యంగా నిద్రలేస్తోందనే కారణాలను చూపుతూ తన భార్య నుండి విడాకులు కావాలని ఓ వ్యక్తి ముంబై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌దారుడిని చీవాట్లు పెట్టింది. పిటిషన్‌దారుడికి మద్దతుగా నిలిచిన తండ్రిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

చిన్న చిన్న విషయాలకు విడాకుల కోసం కోర్టులకు వెళ్ళడం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అదే తరహ ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకొంది. రుచికరమైన ఆహరం వండడం లేదనే సాకుతో విడాకులు ఇవ్వాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

అయితే పిటిషన్ దారుడు చెబుతున్న విషయాలు వాస్తవాలు అవునో కాదో కూడ కోర్టు విచారించింది. అన్నీ విషయాలు విచారించిన తర్వాత పిటిషనర్‌ తీరుపై కోర్టు మండిపడింది.

రుచికరమైన భోజనం కోసం విడాకుల పిటిషన్

రుచికరమైన భోజనం కోసం విడాకుల పిటిషన్

ఆలస్యంగా నిద్రలేస్తుంది, ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని , రుచికరంగా భోజనం వండిపెట్టడం లేదంటూ ముంబై శాంతాక్రజ్‌కు చెందిన ఓ వ్యక్తి ముంబై కోర్టులో తన భార్య నుండి విడాకులు ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేశాడు. కొడుకుకు అతడి తండ్రి కూడ మద్దతుగా నిలిచాడు.

భార్యపై భర్త చేసిన ఆరోపణలు

భార్యపై భర్త చేసిన ఆరోపణలు

తన భార్య ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తనకు, తన తల్లిదండ్రులకు వండిపెట్టడం లేదని, చేసిన వంట రుచికరంగా ఉండడం లేదని పేర్కొన్నాడు. సాయంత్రం ఆరు గంటల తరువాత ఆఫీసు నుంచి ఇంటికి వస్తుందని భర్త ఆరోపించాడు. అలసటగా ఉందని కాసేపు నిద్రపోతుందన్నారు. మళ్లీ రాత్రి 8:30 గంటల వరకు వంట ప్రారంభించదుని పిటిషన్‌లో ప్రస్తావించారు. తమకు సరిపడా ఆహారం వండదన్నారు. తాను ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్లు కూడా ఇవ్వదని ఆరోపించిన భర్త, తన భార్య నుంచి విడాకులిప్పించాలని కోరాడు.

భార్య వివరణ కోరిన కోర్టు

భార్య వివరణ కోరిన కోర్టు

పిటిషన్ దారుడు చేసిన ఆరోపణలపై న్యాయస్థానం పిటిషన్ దారుడి భార్య వివరణ కోరింది. తన భర్త తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని, ఉదయం ఆఫీస్‌ కు వెళ్లే ముందే కుటుంబం మొత్తానికి వంట చేస్తానని చెప్పింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నానని న్యాయస్థానానికి వివరించింది. ఆమె వాదనతో ఇరుగుపొరుగులు కూడా ఏకీభవించారు

పిటిషన్‌దారుడికి కోర్టు షాక్

పిటిషన్‌దారుడికి కోర్టు షాక్

విడాకులు కోరిన భర్తపై న్యాయస్థానం మండిపడింది. ఇంటి పనితో పాటు భార్య ఆఫీస్‌ కు వెళ్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. ఆమె ఆఫీస్‌ నుంచి వచ్చేప్పుడే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువస్తోందన్నారు. ఎంత పని ఉన్నా కుటుంబసభ్యుల కోసం ఉదయం, సాయంత్రం వంట చేస్తోంది. అలాంటి భార్యను వచ్చినప్పుడల్లా నీరివ్వలేదని ఆరోపించడం సరికాదని సూచించింది. భర్త ఎవరైనా భార్య ప్రతిసారి నీళ్లి ఇలాంటి ఆరోపణలతో విడాకులు కోరడం సబబు కాదని ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది.

English summary
A man's plea seeking divorce from his wife on the grounds that she was not "dutiful" as she woke up late and did not cook tasty food has been dismissed by the Bombay High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X