హోటల్‌లోని సాధారణ ఫ్రిడ్జ్‌లో కోవాగ్జిన్ డోసులు: దర్యాప్తునకు మేయర్ ఆదేశం
ముంబై: ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తోంది బ్లాక్ మాఫియా. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఓ హోటల్‌లో సాధారణ ఫిడ్జ్‌లో కరోనా వ్యాక్సిన్లు ఉండటాన్ని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు.
కోవాగ్జిన్ డోసులు లభించడంతో హోటల్‌ను సీజ్ చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. ముంబై అంధేరి తూర్పులోని లలిత్ హోటల్‌లో తనిఖీ చేయగా కోవాగ్జిన్ డోసులు బయటపడ్డాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులతో కలిసి ఆమె నగరంలో తనిఖీలు నిర్వహించారు.

స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులతో ఈ హోటల్ అనుసంధానమయ్యిందని, అందుకే ఇక్కడ కోవాగ్జిన్ టీకాలను అక్రమ నిల్వ చేసినట్లు ఆమె తెలిపారు. అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించబడిన వ్యాక్సిన్లేనా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ హోటల్ వద్ద సుమారు 500 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు.
Recommended Video
ఇక్కడ హోటల్ తప్పేమీ లేదని, కానీ, వ్యాక్సిన్లను నిబంధనల ప్రకారం నిల్వ చేయకపోవడం ఆ ప్రైవేటు ఆస్పత్రి తప్పిదమని మేయర్ తెలిపారు. బీఎంసీ సెంటర్లలోనే వ్యాక్సిన్లు లభించడం లేదని, అలాంటి ఇక్కడ ఇన్ని వ్యాక్సిన్లు ఎలా వచ్చాయనేదానిపైనా విచారిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఫ్రిడ్జ్ లో వ్యాక్సిన్లను ఉంచడం వల్ల వాటి పనితీరులో మార్పు ఉండే అవకాశం ఉన్నారు. మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications