ముంబై హైలర్ట్: సిద్ధి వినాయక ఆలయానికి ఉగ్రముప్పు
ముంబై: నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఏదేని మంగళవారం ఈ ఆలయం పరిసరాల్లో గుమిగూడిన జన సమూహంపై దాడి చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
అంతేగాక, ముంబై వినాయక ఆలయంతోపాటు దేశంలోని పలు లక్ష్యాలపై జనవరి 28వ తేదీలోగా దాడులు జరిపేందుకు పాకిస్థాన్ చెందిన జమాత్ ఉద్‌దవా, లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ టైస్టు సంస్థలు భారత్‌కు నాలుగు వేర్వేరు బృందాలను పంపించాయంటూ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహారాష్ట్ర పోలీసులతోపాటు ముంబై పోలీసులను అప్రమత్తం చేశాయి.

గణతంత్ర ఉత్సవాల నేపథ్యంలో మరోసారి ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థ ఐబీ హెచ్చరించింది. జనవరి నెలాఖరు లోపే విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని పేర్కొంది.
ఉత్తర భారతంలో ఈ దాడులు చేసే అవకాశం ఉందంటూ, అన్ని రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్ర తోపాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications