పోలీసుల పైశాచికం: మహిళలను తీవ్రంగా కొట్టి ఈడ్చారు(వీడియో)
ముంబై: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమంలో ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై పోలీసులు వారిపై విరుచుపడి తమ పైశాచికాన్ని చాటుకున్నారు. పోలీసులు ఆ మహిళలపై తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు.
గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించారనే కారణంగా వారిని చితకబాదారు.
నిమజ్జనానికి ముందు జరిగే శోభాయాత్రకు కొంత సమయానికి ముందు ముంబయి నగరంలోని ఓ వీధిలో పెట్టిన గణేశ్ ప్రతిమను దర్శించుకునేందుకు ఇద్దరు మహిళలు వచ్చారు.
![Mumbai: Police brutally assault, detain 2 women during Ganesh Visarjan [VIDEO] Mumbai: Police brutally assault, detain 2 women during Ganesh Visarjan [VIDEO]](https://imagesvs.oneindia.com/te/img/2015/09/28-1443439610-ehegbach-867.jpg)
ఆ మహిళలు, పొరపాటున వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమె చెప్పే సమాధానం కూడా వినకుండా తీవ్రంగా కొట్టి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో పలు మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది.
పోలీసుల తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళలు అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టి, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివీస్ విచారణకు ఆదేశించారు.
Not Ganeshotsav | Video | Journalist Poonam Aparaj covering Lalbaug cha Raja Ganpati beaten up by police women. pic.twitter.com/GwSeyvWtAD
— MUMBAI NEWS (@Mumbaikhabar9) September 28, 2015 











Click it and Unblock the Notifications