అసభ్య ప్రవర్తన, బెదిరింపులు: రాధేమాపై మరో కేసు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులకు రాధేమా(50) పాల్పడుతోందని పేర్కొంటూ నటీ డాలీ బింద్రా(45) అనే భక్తురాలు ముంబై పోలీసుల ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమాతో పాటు ఆమె 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. కాగ, బాధితురాలు బింద్రా గతంలో రాధేమా భక్తురాలు. బింద్రా ఆగస్టు 11న ట్విట్ చేస్తూ ఇకపై రాధేమా భక్తురాలిగా కొనసాగనని పేర్కొంది.
రాధేమా, ఆమె అనుచరులతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. వరకట్న వేధింపుల కేసులో రాధేమాపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణను కూడా ఎదుర్కొంటున్నారు.

డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో ఉన్న రాధేమా ఫోటోలు సోషల్ మీడియాలో ఇటీవల హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, రాధేమా మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్‌కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు చేశారు. రాధేమా డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు బెదిరించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications