యాకూబ్ మెమెన్ వీరుడు: జర్నలిస్టు కోసం వేట
ముంబై: సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతు, యువతను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
జుబర్ అహమ్మద్ ఖాన్ అనే జర్నలిస్టు కోసం పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమెన్ ను ఉరి తీసిన సమయంలో జుబర్ అహమ్మద్ సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశాడు.
యాకూబ్ మెమెన్ వీరమరణం పొందాడని, అతను మృతవీరుడు అంటూ అభివర్ణించాడు. అంతే కాకుండా తనకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా ఉండాలనే ఆశ ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

దీనిపై ఒక వ్యక్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. జర్నలిస్టు జుబర్ మహమ్మద్ నవీ ముంబైలో ఉంటున్నాడని క్రైం బ్రాంచ్ పోలీసులు అంటున్నారు. జుబర్ అహమ్మద్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
దీనా నగర్ లో ఉగ్రవాదులు దాడులు చెయ్యడం, పాకిస్థాన్ నుండి ఉగ్రవాదులు చొరబడటం, భారత్-పాక్ సరిహద్దులలో పదే పదే కాల్పులు జరుగుతున్న సమయంలో దేశ ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టు తృటిలో తప్పించుకున్నాడని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications