కారులో బిడ్డకు తల్లి పాలిస్తుండగానే క్రేన్‌తో కారును లాక్కెళ్లిన పోలీసులు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ట్రాఫిక్ పోలీసు అతి ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

రోడ్డుపై ఆగి ఉన్న కారులో ఓ తల్లి తన బిడ్డకు పాలు ఇస్తోంది. అయితే ఇది ఏమాత్రం పట్టించుకోని ఆ ట్రాఫిక్ పోలీసులు.. నో పార్కింగ్ ఏరియాలో కారు ఆగి ఉందని అమానవీయంగా ప్రవర్తించారు.

కారులో తల్లీబిడ్డలు ఉన్నప్పటికీ

కారులో తల్లీబిడ్డలు ఉన్నప్పటికీ

కారులో తల్లీబిడ్డలు ఉన్నప్పటికీ, దానిని క్రేన్‌తో సాయంతో లాక్కుపోయారు. ఈ ఘటనకు సంబంధఇంచి ఓ కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

 ట్రాఫిక్‌కు అంతరాయంగా కారు

ట్రాఫిక్‌కు అంతరాయంగా కారు

శుక్రవారం సాయంత్రం మలంద్‌లోని రద్దీగా ఉండే ఎస్వీ రోడ్డులో ఓ వ్యక్తి కారు నిలిపాడు. ఆయన భార్యాపిల్లలతో కలిసి పని మీద వచ్చాడు. అయితే ఆ కారు కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వచ్చి దానిని క్రేన్‌తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కిందకు దిగాలని కోరినా ఆమె వినలేదు

క్రేన్‌ కారును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆమె బిడ్డతో కలిసి కారు ముందు సీట్లో కూర్చొంది. పోలీసు అధికారులు వచ్చి కిందకు దిగాలని కోరినా ఆమె వినలేదు. ఆమె సీట్లో కూర్చొని ఉండగా, క్రేన్‌తో కారును లాక్కెళ్లారు.

స్పందించిన ఉన్నతాధికారులు

స్పందించిన ఉన్నతాధికారులు

ఈ దృశ్యం సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. తల్లీబిడ్డల భద్రతకు ముప్పు కలిగిన నేపథ్యంలో కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి దర్యాప్తును ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A car with a woman sitting in the rear seat was towed by the Mumbai traffic police on Saturday while she was breastfeeding her seven-month-old child. She pleaded the traffic policemen to stop and flashed her medical prescription from the window saying she was unwell but the cop appeared unconcerned and continued speaking on the mobile phone.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి