మోడీని కాదు! చిరాకుతో చేశా: తగ్గిన నేహా దూఫియా
ముంబై: ముంబైలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్న అంశంపై బాలీవుడ్ నటి నేహా దూపియా వారం రోజుల క్రితం పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ పైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తన వ్యాఖ్యల పైన ఆమె వివరణ ఇచ్చింది.
తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. ముంబై ప్రజలకు సాయం చేయలేకపోతున్నాననే చిరాకుతో తాను ఆ విధంగా ట్విట్ చేశానని చెప్పుకొచ్చింది. ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించలేదని చెప్పింది.
ఆందోళనకారులు ఇంటి వద్ద ఆందోళన చేసినప్పుడు తమను భద్రత కల్పించినందుకు పోలీసులకు ఆమె ధన్యవాదాలు చెప్పింది. తాను ఎవరి సెంటిమెంట్లను కించపరచడానికి ఇలా చేయలేదంది.

అంతేకాదు, తాను మనస్ఫూర్తిగా ప్రభుత్వం చేపడుతున్న యోగా డే, స్వచ్ఛ భారత్‌కు మద్దతు పలుకుతున్నానని చెప్పింది. అదే సమయంలో, ప్రజల సదుపాయాల పైన దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పింది.
వారం రోజుల క్రితం.. ఇటీవల ముంబైలో భారీ వర్షాలు సంభవించినప్పుడు దానిని ఉద్దేశిస్తూ మంచి పాలన అంటే సెల్ఫీలు, యోగా దినోత్సవాలు నిర్వహించడం కాదంటూ నేహా దూఫియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోడీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఆమె ఇంటి వద్ద ఆందోళన కూడా చేశారు.
One rain n the city comes to a standstill. Good governance is not about selfies n makin us do yoga,it's making sure ur citizens r safe.
— Neha Dhupia (@NehaDhupia) July 21, 2015 Mumbaikars pls be warned traffic outside is terrible,roads r flooded the situation is getting worse by the minute. Step out only if u must!
— Neha Dhupia (@NehaDhupia) July 21, 2015 











Click it and Unblock the Notifications