
Viral Video: అద్గదీ..ఇదీ కదా "మేడిన్ ఇండియా మూవ్‌మెంట్" రైల్లో అలా..
వర్షాలు, వరదలతో మహారాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ముంబై వాసులు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పడరాని పాట్లు పడ్డారు. కుండపోతగా కురిసిన వానలతో ఏం పనులు చేసుకోలేకపోయారు. ఇక వర్షాల సమయంలో రోడ్లపై నిలిచిన నీరు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తే, ఇళ్లల్లో వర్షాల కారణంగా బట్టలు ఆరక కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న బట్టలు ఆరని సమస్య ఇప్పుడు ముంబై వాసులలో ఆసక్తికర చర్చకు కారణమైంది.

రైల్లో బట్టలు ఆరేసిన ముంబై వాసులు
వర్షాకాలంలో ఇళ్ళలో మహిళలు బట్టలు ఆరేసుకోవటానికి ఇబ్బంది పడతారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ఇక ఆ బట్టలు ఆరినట్టే. ఇంటి లోపలే దండాలు కట్టి ఫ్యాన్లు వేసి మరీ నానా తంటాలు పడతారు. కానీ ముంబై వాసులు లోకల్ రైళ్ళను బట్టలు ఆరేసుకోవటానికి వాడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైళ్ళు నడుస్తున్నప్పుడు గాలి వేగానికి బట్టలు త్వరగా ఆరతాయని ఎంచక్కా బట్టలు ఆరేశారు.
లోకల్ రైల్లో బట్టలు ఆరబెట్టిన ఘటన వీడియో వైరల్
అసలేం జరిగిందంటే సహజంగా ఎవరైనా రైళ్ళలో ప్రయాణం చేస్తారు. తమ గమ్యస్థానాలకు వెళ్లడం కోసమే రైళ్లను ఆశ్రయిస్తారు. అయితే ముంబైవాసులు లోకల్ రైలులో ప్రయాణం చేయడమే కాకుండా బట్టలు ఆరబెట్టుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన వీడియోలో, లోకల్ రైలులో బట్టలు వేలాడుతూ కనిపించాయి . వర్షాల ప్రభావంతో రైల్లో ప్రయాణిస్తున్న కొందరు ఏకంగా రైల్లోనే బట్టలు ఆరేశారు.

బట్టలు ఆరేసినా పట్టించుకోని ప్రయాణికులు.. రైల్వే అధికారుల రెస్పాన్స్ ఏంటో?
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను దాదర్ ముంబైకర్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వారు షేర్ చేసిన మీడియాలో లోకల్ ట్రైన్‌లో టవల్, శాలువా తో పాటు మరికొన్ని బట్టలు ఆరబెట్టడం చూడవచ్చు. ఇక రైల్లో బట్టలు ఆరేసినప్పటికీ మిగతా ప్రయాణికులు మాత్రం అవేమీ పట్టనట్లు కూర్చున్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది . దీనిని చూసిన నెటిజన్లు రైలు బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మేడిన్ ఇండియా మూమెంట్ అంటూ పోస్ట్ లు
పాపం వాన కష్టాలు అంటూ నవ్వుకుంటున్నారు. ఈ వాతావరణంలో మీ బట్టలు ఆరబెట్టడానికి మరింత ప్రయోజనకరమార్గం అంటూ చెప్తున్నారు
ముంబై స్థానికులు...ఇది కదా మేడ్ ఇన్ ఇండియా మూమెంట్ అంటూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. మన రైళ్లు ఇందుకు కూడా ఉపయోగపడుతున్నాయి అంటూ చెప్పుకుంటున్నారు. మరి ఇది చూస్తే రైల్వే అధికారులు ఎలా స్పందిస్తారో మరి.