బిర్యానీ, పిజ్జా, బర్గర్ల మీదే బతికేస్తున్నారు..: స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్

టాప్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గి విడుదల చేసిన హౌ ఇండియా స్విగ్గీడ్ 10వ ఎడిషన్ తో పలు ఆసక్తికర విషయాలు వెలగులోకి వచ్చాయి. బిర్యానీ మొదలుకుని లస్సీ, ఫలుదా వరకూ లక్షల సంఖ్యలో రికార్డయిన ఫుడ్ డెలివరీ ఆర్డర్లు ఇందులో ఉన్నాయి. పిజ్జాలు, బర్గర్లకు లెక్కే లేదు. ఫుడ్ సహా దాదాపు అన్ని కేటగిరీల్లో ఆర్డర్లు పెట్టిన మెట్రో నగరాల్లో ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచింది. అత్యధికంగా బిర్యానీలు ఆర్డర్లు ఇక్కడి నుంచి అందాయి.

ఈ ఏడాది ముంబైకి చెందిన ఒక ఫుడీ.. స్విగ్గీ ద్వారా ఏకంగా 3,196 ఫుడ్ ఆర్డర్లు పెట్టాడు. ఇందులో బిర్యానీలే అధికం. సగటును రోజుకు తొమ్మిది ఫుడ్ ఆర్డర్లు అతని నుంచి అందాయి. వ్యక్తిగత కేటగిరీలో ఇదే టాప్. దేశంలోనే అత్యధికం ఆర్డర్‌లతో రికార్డు సృష్టించాడు. జనవరి నుండి నవంబర్ 2025 మధ్య ఇచ్చిన ఈ ఆర్డర్లు అందినట్లు స్విగ్గి రిపోర్ట్ వెల్లడించింది. ఆ ముంబైకర్ దాదాపు ప్రతి రోజూ తొమ్మిది ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. అతని దినచర్యల్లో స్విగ్గి ఓ భాగమైనట్టయింది.

Mumbai s Foodie Legend 3196 Orders in 2025 Redefined Delivery Habits

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 93 మిలియన్ల బిర్యానీ, 44.2 మిలియన్ల బర్గర్ల ఆర్డర్లు అందినట్లు స్విగ్గి తెలిపింది. ప్రత్యేకించి- మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల మధ్య స్నాక్ టైమ్‌లో ఇవి అందాయి. మెట్రో నగరాలు, అభివృద్ధి చెందుతున్న ఎగువ మధ్యస్థాయి పట్టణాల్లోనూ బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, దోశ వంటి వంటకాలు టాప్‌లో నిలిచాయి. ముంబై నగరం అన్ని కేటగిరీలలోనూ నిలకడగా టాప్ మూడు స్థానాల్లో నిలిచింది.

రక్షాబంధన్, వాలెంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో పూణే, పాట్నా వంటి నగరాల్లో ప్రీమియం డైనింగ్ బిల్లులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. ఒక్క రక్షాబంధన్ నాడు 26,000లకు పైగా డైనింగ్ బిల్లులు రికార్డయ్యాయి. ముంబై సూపర్ యూజర్ జాతీయ రికార్డు నెలకొల్పింది. కార్పొరేట్ హబ్‌లలో డెస్క్‌ఈట్స్ ఈ ఏడాది భారీగా విస్తరించింది. అదే సమయంలో ఇన్‌కాగ్నిటో మోడ్ 69, ఫుడ్ ఆన్ ట్రైన్స్ 380 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

మెట్రో నగరాలు, పట్టణాల నుంచి ప్రతి నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్లు అందాయి. ఈ మొత్తం ఆర్డర్లలో చికెన్ బిర్యానీ ఒక్కటే 5.77 కోట్ల ప్లేట్లను కవర్ చేసింది. బర్గర్‌- 4.42 కోట్లు, పిజ్జా- 4.01 కోట్లు, దోసెలు- 2.62 కోట్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓ యూజర్ ఈ ఏడాది మొత్తం మీద రూ. 47,000 కుకీలు ఆర్డర్ చేశాడు. మరొకరు రూ. 3 లక్షల మేర ఫుడ్ ఆర్డర్లు పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుకీ కింగ్ ఆగస్టులో రూ. 47,106 ఖర్చు చేసి 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీలను కొనుగోలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+