తల్లి ప్రేరేపణతో మరదలిపై యువకుడి రేప్

ముంబై: తల్లి ప్రేరేపణతో ఓ యువకుడు తన 16 ఏళ్ల మరదలిపై అత్యాచారం చేశాడు. తల్లిని, ఆమె కుమారుడిని నవపడ పోలీసులు అరెస్టు చేశారు. యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే, యువతి, ఆమె తల్లిదండ్రులు అందుకు సిద్ధంగా లేరు. దీంతో తల్లి ప్రేరేపించడంతో యువకుడు ఆమెపై అత్యాచారం చేసాడు.

అమ్మాయి తన ఆంటీ ఇంట్లో గత ఏడేళ్లుగా ఉంటూ జూనియర్ కాలేజీలో చదువుతోంది. అమ్మాయి తల్లిదండ్రులు నాగపూర్‌లో ఉంటున్నారు. దాంతో పైచదువుల కోసం తమ కూతురిని థానేలోని ఆమె ఆంటీ ఇంటికి పంపించారు. ముంబైలో మంచి చదువు లభిస్తుందనే ఉద్దేశంతో ఆ పనిచేశారు.

అమ్మాయి అత్త షకీరా బానో (48) గత ఏడేళ్లుగా అమ్మాయి బాగోగులు చూస్తోంది. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమారులు నవపడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె పెద్ద కుమారుడు రషీద్ అలీ (31) ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. అమ్మాయితో అతను పలుమార్లు ఆ విషయం చెప్పాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు.

Mumbai: Woman asks son to rape 16-year-old niece, held

తల్లికి అతను ఆ విషయం చెప్పాడు. దాంతో తల్లి తన సోదరుడి వద్దకు వెళ్లి పెళ్లి ప్రతిపాదన పెట్టింది. అందుకు వారు నిరాకరించి, తమ అమ్మాయిని తిరిగి నాగపూర్‌కు తెచ్చుకున్నారు. తన మేనకోడలిపై అత్యాచారానికి తాను పథకం వేశానని షకీరా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అమ్మాయిని షకీరా థానేకి పిలిపించింది. అమ్మాయి ఇంటికి రాగానే ఆమె చేతులు కట్టేసి, ఆమెను పడకగదిలోకి నెట్టి బయటి నుంచి గొళ్లెం పెట్టింది. దాంతో ఆమె కుమారుడు అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతను బెదిరించి, ఇంటికి వెళ్లి పెళ్లికి ఒప్పించాలని చెప్పాడు.

అయితే, అమ్మాయి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పింది. దాంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిని వారికి అప్పగించారు. బాధితురాలి అత్తను, బావను పోలీసులు అరెస్టు చేశారు. రషీద్‌ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఏ మాత్రం అంగీకరించలేదు. పైగా, వారం రోజుల క్రితం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతన్ని చేయి చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+