ఇబ్బందులు: బిజెపికి గుడ్‌బై చెప్పాలనుకున్న ముండే!
ముంబై: ఇటీవల మృతి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే బిజెపిలో ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొన్నారా? పార్టీని వీడాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నాయకుడు. బిజెపి నుండి వైదొలగాలని ముండే అనుకున్నట్లు ముంబైకి చెందిన పార్టీ ఎమ్మెల్సీ పాండురంగ్ పునద్కర్ వెల్లడించారు.
పార్టీలో ముండే ప్రతి విషయంలోనూ సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ క్రమంలో ఒకానొక సమయంలో పార్టీని వదిలి వెళ్లి పోవాలనుకున్నారన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

పార్టీలో అనేకసార్లు ముండే అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ముండే తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడన్నారు. గతంలో ముండేకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు ఆఫర్ చేసిందన్నారు.
మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్
గోపీనాథ్ ముండే మృతి పట్ల ప్రజల్లో గందరగోళం ఉందని, ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications