ఐదేళ్ల చిన్నారిని హత్య, తల్లిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్లు.. ఎక్కడంటే ?
హరియాణాలోని జీంద్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి నలుగురు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె ఐదేళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశారు. ఈ దారుణం స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు సైతం ఉండడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తన ముగ్గురు పిల్లలతో పాటు భర్తతో కలిసి గుడిసెలో నివసిస్తోంది. అయితే భర్త లేని సమయం చూసి గుడిసెలోకి చొరబడ్డారు దుండగులు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతు నులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు.

ఇక గురువారం స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరు అమిత్‌గా గుర్తించగా, మిగతా ముగ్గురు మైనర్లు అని ఎస్.ఐ. యశ్‌వీర్ తెలిపారు. నిందితులపై హత్య, గ్యాంగ్‌రేప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. మరోవైపు స్థానికంగానే కాకుండా సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బాధిత మహిళకు న్యాయం కల్పించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వమే ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక, మానసిక సహాయం అందించాలని పలువురు ప్రజా ప్రతినిధులు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
NCRB గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. చిన్నారులు కూడా రక్షణ లేని పరిస్థితిలో నిందితులపై కఠిన చర్యలు అవసరమని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి దారుణాలు మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలకు నిలువెత్తు నిదర్శనమని.. మృగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications