ఎదుటివారిని కొట్టండి, అవసరమైతే చంపేయండి: వైస్ ఛాన్స్‌లర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఘాజీపూర్: వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్‌కు వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న రాజారామ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఘాజీపూర్‌లోని కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యువత ఏం కావాలని కోరుకుంటారో అది సాధించి తీరతారని, జీవితంలో అనుకున్నది సాధించాలన్న తపన ఉన్నవారే పూర్వాంచల్ వర్సిటీ విద్యార్థులు అవుతారని, ఒకవేళ వర్సిటీ విద్యార్థులు ఎవరితోనైనా గొడవ పడితే దెబ్బలు తిని ఏడుస్తూ తన వద్దకు రావొద్దని, ఎదుటివారిని కొట్టండి.. అవసరమైతే చంపేయండని, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పారు.

ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. విద్యార్థులను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన ఆయన్ను బాధ్యతల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ నేత శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలతో ఆయన విద్యార్థులకు ఏం చెబుతామని అనుకుంటున్నారని మండిపడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ రాయ్ మాట్లాడుతూ... ఇవి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలని, విద్యార్థులకు వైస్ ఛాన్సులర్లు మంచి చెప్పాలని, కానీ పూర్వాంచల్ యూనివర్సిటీ వీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications