Bajrangdal: శివమొగ్గ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు, ఇప్పటికే 10 మంది, క్యూలో కొందరు ?

బెంగళూరు/ శివమొగ్గ: హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోయింది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు అంటున్నారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి ఆరు నెలల క్రితం చిన్న గొడవ జరిగిందని విచారణలో వెలుగు చూసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. నాలుగు ప్రత్యేక టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులోని నిందితులు వరుసగా అందరిని అరెస్టు చేస్తున్నారు. గురువారం మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు అయ్యారు.

గోవులను అడ్డుకున్నాడు

గోవులను అడ్డుకున్నాడు

భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోతోంది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

పక్కా స్కెచ్ తో పరారైన హంతకులు

పక్కా స్కెచ్ తో పరారైన హంతకులు

శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో శివమొగ్గలోని బుద్దానగర్ లో నివాసం ఉంటున్న ఖాసీమ్ (30), బెంగళూరులోని జేపీ నగర్ లో నివాసం ఉంటున్న సయ్యద్ నదీమ్ (20) అనే ఇద్దరిని అరెస్టు చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే ?

ఆ రోజు ఏం జరిగిందంటే ?


హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి ఆరు నెలల క్రితం చిన్న గొడవ జరిగిందని, ఆ విషయంలో హత్య జరిగే అవకాశం ఉంటుందని విచారణలో వెలుగు చూసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని మూడు రోజల క్రితం పోలీసు అధికారులు చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే హర్షాను చంపేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 10 మంది అరెస్టు

మొత్తం 10 మంది అరెస్టు


భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో మొదట ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తరువాత మరో నలుగురిని అరెస్టు చేశారు. తరువాత మరో ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం భద్రావతికి చెందిన అబ్దుల్ రోషన్, శివమొగ్గకు చెందిన వాది ఎ ముదాద జాఫర్ సాదిక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా కొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+