కూరలో కారం ఎక్కువైందని భార్యను చంపేసిన భర్త..
కూరలో కారం ఎక్కువైందన్న కారణంతో తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ భర్త భార్యను కర్రతో బాది చంపాడు.
న్యూఢిల్లీ: కూరలో కారం ఎక్కువైందన్న కారణంతో తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయిన ఓ భర్త భార్యను కర్రతో బాది చంపాడు. ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. చనిపోయిన మహిళ శరీరంపై 22చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్లంబర్ గా పనిచేస్తున్న సుబోధ్ అనే వ్యక్తి తన భార్య మనీషాకు తెలియకుండా మునియా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉండటంతో ఆ తర్వాత అవి మరింత ముదిరాయి. దీంతో మనీషా రోహిణిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

కొద్దిరోజుల తర్వాత ఈ నెల 10న సుబోధ్ ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే మునియా కూడా అక్కడికి రావడం.. భర్తతో కలిసి ఉండటాన్ని మనీషా సహించలేకపోయింది. ఇదేంటని నిలదీసింది. దీంతో ఆమెను బుజ్జగించి మునియాను వేరే ఇంట్లో ఉంచుతానని చెప్పాడు.
మునియా వెళ్లిపోయిన తర్వాత మనీషా భోజనం సిద్దం చేసింది. తినే సమయంలో కూరలో కారం ఎక్కువైందని సుబోధ్ మండిపడ్డాడు. అక్కడితో ఆగక ఓ కర్ర తీసుకుని ఆమెను చావబాదాడు. తీవ్రంగా గాయపడ్డ మనీషా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications