వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైశ్రీరాం చెప్తారా.. చస్తారా: ముస్లిం దంపతులపై హిందూ యువకుల దాడి

|
Google Oneindia TeluguNews

అల్వార్ : రాజస్థాన్ అల్వార్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి ముస్లిం దంపతులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హర్యానాకు వెళ్లేందుకు శనివారం రాత్రి అల్వార్ బస్టాండ్‌లో భోజనం చేసి వేచి చూస్తుండగా.. వన్ష్ భరద్వాజ్, సురేంద్ర భాటియా అనే ఇద్దరు వ్యక్తులు ఆ ముస్లిం దంపతులపై దుర్భాషలాడాడు. అనంతరం వారిని రామ్- రామ్ అని నినదించాల్సిందిగా బలవంతం చేశారు.

<br>ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడి
ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడి

 అల్వార్ బస్టాండులో ముస్లిం దంపతులకు వేధింపులు

అల్వార్ బస్టాండులో ముస్లిం దంపతులకు వేధింపులు

ముస్లిం దంపతులను ఇద్దరు యువకులు వేధిస్తుండటంతో వారు సహాయం చేయాల్సిందిగా గట్టిగా కేకేలు వేశారు. ఇది చూసిన ఇతర ప్రయాణికులు అక్కడికి చేరుకుని ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భరద్వాజ్ మరియు భాటియాల మీద అల్వార్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన అత్తగారిల్లు దిద్వానా నుంచి తాము ఉంటున్న నూహ్ ప్రాంతానికి వెళ్లేందుకు అల్వార్ బస్టాండులో తన భర్త కోసం మహిళ వేచి ఉండగా ఈ అల్లరి మూకలు అక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింలు భారత్‌లో నివసిస్తారు కానీ రామ జపం మాత్రం చేయరంటూ కామెంట్స్ చేస్తూ ఈ దంపతులను వేధించారని పోలీసులు తెలిపారు.

జైశ్రీరామ్ చెప్పనందుకు భర్తపై దాడి

జైశ్రీరామ్ చెప్పనందుకు భర్తపై దాడి

ఇక మహిళ భర్తను రామ్ రామ్ అని నినదించాల్సిందిగా బలవంతం పెట్టగా అందుకు ఆ భర్త చెప్పేందుకు నిరాకరించడంతో ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకున్న భార్యపై లైంగిక వేధింపులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె ముందు ఆ ఇద్దరు వ్యక్తులు బట్టలు విప్పి చాలా అసహ్యంగా ఆమెతో ప్రవర్తించినట్లు పోలీసులు వివరించారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఇద్దరి యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు.

 మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు ఆ ఇద్దరి యువకులపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. ఇద్దరినీ పోలీసులు చికిత్స కోసం అల్వార్‌లోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఇద్దరి యువకులపై లైంగిక వేధింపుల కేసు సెక్షన్ 354ఏ, మత పరమైన భావాలను దెబ్బతీసినందుకు గాను సెక్షన్ 295 ఏతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద వారిని అరెస్టు చేశారు.

English summary
A Muslim couple from Alwar was allegedly assaulted by two men for not chanting 'Ram-Ram' late on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X