యోగ నేర్పితే ఇక అంతే: ముస్లిం యువతికి హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంచీ: యోగా టీచర్‌గా ప్రఖ్యాతి గాంచిన రఫియా నాజ్‌ ప్రస్తుతం మత పెద్దల నుండి ఫత్వా అందుకొంది.యోగో నేర్పించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది హెచ్చరించారు. దీంతో ఆమెకు భద్రతను పెంచారు.

రఫియా నాజ్ పేరు ఈ పేరు ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది. కొద్దికాలం క్రితం రాంచీలో యోగా గురు రాందేవ్ బాబాతో కలిసి ఆమె వేదిక పంచుకుంది. . అయితే స్వమతస్థుల నుంచే ఆమె ఇప్పుడు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది.

Muslim Teacher Who Impressed Baba Ramdev With Yoga Gets Threats; She Is Being Forced To Stop Practicing Yoga

రఫియా నాజ్‌కు ముస్లిం వర్గాల నుంచి బెదరింపు హెచ్చరికలు వచ్చిన విషయం జార్ఖాండ్ ముఖ్యమంత్రి రుఘవర్ దాస్ ప్రిన్పిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు తమ పోలీసు బృందం రఫియాను కలుసుకుందని రాంచీ ఎస్పీ కుల్‌దీప్ ద్వివేది తెలిపారు. ఆమె భద్రత కోసం ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా కేటాయించినట్టు చెప్పారు

రాంచీలోని డోరండ ప్రాంతంలో నివసిస్తున్న రఫీయా నాజ్ స్థానిక కాలేజీలో ఎంకామ్ చేస్తోంది. రాందేవ్ బాబాతో కలిసి స్టేజ్‌పై యోగాసనాలు వేయడంతో ఆమె పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు చంపుతామంటూ బెదరింపు హెచ్చరికలతో ఫత్వా జారీ కావంతో ఆమె కుటుంబసభ్యులు బెంబేలెత్తుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A yoga instructor named Rafia Naaz has been getting threats in Ranchi’s Doranda just because she teaches it. The people who are sending her threats are from a particular religious groups. Chief Minister Raghuvar Das took note of the incident; SSP Kuldeep Dwivedi granted two bodyguards to Rafia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి