
సాధువు నోటి దూల: ముస్లిం మహిళలను కిడ్నా చేసి.. రేప్ చేస్తా.. ఎక్కడ అంటే..?
ఇటీవల స్వామిజీలు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వర్గాన్ని, మతంపై వ్యాఖ్యానిస్తే.. దుమారం రేగుతుంది. మరీ మహిళల విషయంపై కామెంట్ చేస్తే రచ్చ రచ్చే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ స్వామిజీ నోటి దూల ప్రదర్శించాడు. ఓ వర్గం మహిళలపై చేసిన కామెంట్స్ రచ్చకు దారితీసింది. ముస్లిం మహిళలను రేప్ చేస్తా అని స్వామిజీ చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తోంది.

కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తా
ముస్లిం మహిళలకు స్వామిజీ వార్నింగ్ ఇచ్చాడు. సీతాపూర్ జిల్లాలో ఓ మసీదు ముందే హెచ్చరికలు చేశాడు. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్నాడు. మైకులో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైనా ముస్లిం వ్యక్తి స్థానిక మహిళలను వేధిస్తే అంటూ స్టార్ట్ చేశారు. వేధించొద్దు అని చెప్పడం ఓకే.. కానీ అప్పుడు ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి.. బహిరంగంగా రేప్ చేస్తానని బెదిరించారు. స్వామీజీ మాటలను విన్న జనం కేరింతలు కొట్టడం విశేషం. అక్కడున్న వారు జై శ్రీ రామ్ అంటూ అరిచారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జీపులో సాధువు
కాషాయ వస్త్రాలు ధరించిన ఓ సాధువు ఓ జీపులో నుంచి అక్కడ సభను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియలో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఫాక్ట్-చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ షేర్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన చిత్రీకరించారని, ఇది జరిగి ఐదు రోజులు అవుతున్నా కూడా పోలీసులు ఇంకా ఎలాంటి చర్యా తీసుకోలేదని పేర్కొన్నారు. ట్వీట్ పై సీతాపూర్ పోలీసులు స్పందించారు. ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారనిపేర్కొన్నారు.

హత్య కోసం రూ.28 లక్షలు
తనను హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నారని, దాని కోసం 28 లక్షలు కూడా సేకరించినట్లు సాధువు ఆరోపించారు. ముస్లిం మహిళలకు వీడియోలో హెచ్చరికలు చేసిన స్వామీజీని భజరంగ్ మునిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం మహిళలపై చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ మైనార్టీ వర్గాల నుంచి నిరసనలు వస్తున్నాయి. తమపై ఇలా కామెంట్ చేయడం ఏంటీ అని అడుగుతున్నారు.

ఇలా అనడం ఏంటీ
ఈ దేశంలో తమకు హక్కు లేదా అని అడుగుతున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి అందరినీ దూషించడం తగదని అంటున్నారు. మైనార్టీ వర్గాల అభిప్రాయాలను మిగతా మేధావులు కూడా ఏకీభవిస్తున్నారు. నిజమేనని.. అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. సో స్వామిజీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.