ట్రిపుల్‌ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు: మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ చట్టం ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురానుందని ప్రధానమంత్రి మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తరాలుగా ముస్లిం మహిళల జీవితా వేదకు ఈ చట్టం ముగింపు పలకనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రిపుల్‌ తలాక్‌ను లోక్‌సభ ఆమోదించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Muslim women have found way to free themselves from practice of triple talaq: PM Narendra Modi

ప్రబలమైన ఈ ఆచారం కారణంగా ముస్లిం మహిళలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది ప్రజలంతా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మోడీ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అవినీతి, నల్లధనం, బినామీ ఆస్తులపై పోరాటం కొనసాగుతుందని మోదీ తేల్చి చెప్పారు. అందరితో కలసి.. అందరి అభివృద్ధి అంటూ నూతన సంవత్సర సందేశాన్ని ఇచ్చారు మోడీ.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In his first remarks on the issue of instant triple talaq after a bill banning it was cleared by Lok Sabha, Prime Minister Narendra Modi today said after "years of suffering", Muslim women have finally found a way out to "free" themselves from the practice.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి