వినూత్నం: రాఖీ పండుగ రోజున జరిగిన వింతలు..!

అహ్మాదాబాద్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికీ, అపూర్వమైన అనురాగానికీ, ప్రతి రూపంగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో అతని చేతికి రాఖీ కడుతుంది సోదరి. అందుకు ప్రతిగా ఆమెను జీవితాంతం భద్రంగా చూసుకునే బాధ్యతను స్వీకరిస్తాడు సోదరుడు.

Muslim women tie rakhis on the wrists of a cut-out of Prime Minister Narendra Modi

శ్రావణ మాస పౌర్ణమిని రాఖీ పర్వదినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు, సిక్కులు, జైనులు ఈ రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. అన్నా చెలెళ్ల ప్రేమ, ఆప్యాయతలకు గుర్తుగా రక్షాబంధన్‌ను శనివారం దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నారు.

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో ముస్లిం యువతులు వినూత్నంగా ఈ రాఖీ పండుగను నిర్వహించుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కటౌట్‌ను తయారు చేసి అందరు యువతులు దానికి రాఖీ కట్టి తమ ప్రేమను చాటారు.

Muslim women tie rakhis on the wrists of a cut-out of Prime Minister Narendra Modi

చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

రక్షాబంధన్ రోజున అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు, కొంతమంది స్నేహితులు కూడా రాఖీ కట్టుకుంటుంటారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈసారి సరికొత్తగా ఆలోచించారు. పాట్నాలోని రాజధాని వాటిక ప్రాంతంలో ఉన్న ఓ చెట్టుకు రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకే తాను చెట్టుకు రాఖీ కట్టినట్టు చెప్పారు. ప్రజలు మరిన్ని మొక్కలునాటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకే ముందుకు రావాలన్నారు. బీహార్ ను పచ్చగా మార్చేందుకు ప్రజలంతా కృషి చేయాలని రక్షాబంధన్ రోజున ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+