భారత్ మాతాకీ జై అనలేదని చేయి చేసుకున్నారు
భారత్ మాతా కీ జై అనే నినాదం చేయని ఓ ముస్లీం మత పెద్దను చితకబాదిన సంఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
చండీగఢ్: భారత్ మాతా కీ జై అనే నినాదం చేయని ఓ ముస్లీం మత పెద్దను చితకబాదిన సంఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
జమ్ము కాశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హిస్సార్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారి ర్యాలీ ఓ మసీదు వద్దకు చేరుకుంది.

ఆ సమయంలో అక్కడి మసీదు నుంచి ఓ మతపెద్ద బయటకు వచ్చారు. అనంత్ నాగ్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ మాతాకీ జై నినాదం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దానికి ఆయన నిరాకరించారు.
దీంతో ఆగ్రహం పట్టలేక ఆందోళనకారుల్లో ఒకరు అతనిపై చేయి చేసుకున్నారు. అయితే చేయి చేసుకున్న వ్యక్తిని మిగతా వారు ఆపి అక్కడి నుంచి పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications