కారులో ముస్లీం యువకుల సజీవదహనం, గోరక్ష్ కార్యకర్తల పనే, సీఎం సీరియస్, సీబీఐకి ఇవ్వాలి, వీహెచ్ పీ !
గోరక్షక్ కార్యకర్తలు ఇద్దరు ముస్లీం యువకులను కారులో సజీవదహనం చేశారని పోలీసులు చెబుతున్నారు. జంట హత్యల కేసులో నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అంటున్నారు.
హర్యానా/జైపూర్: ఎస్ యూవీ కారులో ఇద్దరు యువకుల సజీవదహనం అయిన కేసు మలుపు తిరిగింది. ముస్లీం యువకుల జంట హత్య కేసులో ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు పట్టుకున్నారు. గోరక్షక్ కార్యకర్తలు ఇద్దరు ముస్లీం యువకులను హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. జంట హత్యల కేసులో నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని సీఎం అంటున్నారు. అయితే కారులో కాలిపోయి చనిపోయిన ముస్లీం యువకులు దొంగలు అని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. జంట హత్యల కేసును సీబీఐకి అప్పగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కిడ్నాప్ చేసి చంపేశారు ?
రాజస్థాన్ లోని భరత్ పుర్ జిల్లాలోని ఘాట్ మిశా గ్రామంలో నాసీర్ (25), జునైద్ అలియాస్ జునా (34) అనే ఇద్దరు నివాసం ఉంటున్నారు. బుధవారం నాసీర్, జునైద్ ను కారులో కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత రాజస్థాన్ నుంచి హర్యానాలోని భివానియా సమీపంలోని లోహర్ అనే ప్రాంతంలో గురువారం మహింద్రా బోలేరో ఎస్ యూవీ కారులో నాసీర్, జునైద్ ను సజీవదహనం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

చిత్రహింసలు పెట్టి చంపేశారు
గోరక్ష్ కార్యకర్తలు నాసీర్, జునైద్ ను కారులో కిడ్నాప్ చేశారని వాళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కరోజు అంతా నాసీర్, జునైద్ ను చిత్రహింసలు పెట్టారని వాళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాసీర్, జునైద్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు వివిద కోణాల్లో కేసు విచారణ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

ట్యాక్సీ డ్రైవర్
జంట హత్యల కేసులో హర్యానాలోని నుహా జిల్లాలోని ఫిరోజ్ పుర్ లో నివాసం ఉంటున్న రింకు సైని అలియాస్ రింకు (32) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో పలు సాక్షాలు పరిశీలించిన తరువాత ట్యాక్సీ డ్రైవర్ రింకును అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. గోరక్ష్ నాయకులతో రింకుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గోవులను అక్రమంగా తరలిస్తున్నారని నాసీర్, జునైద్ రింకు తదితరులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

సీఎం సీరియస్
జంట హత్యల కేసులో రింకుతో పాటు అనీల్, శ్రీకాంత్, మోహిత్ యాధవ్ అలియాస్ మోను, లోకేష్ సింఘ్లా అనే యువకులు హత్య చేశారని పోలీసులు అంటున్నారు. జంట హత్యల కేసులో నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ అంటున్నారు. హంతుకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని సీఎం తెలిపారు.

వాళ్లు దొంగలు.... కేసు సీబీఐకి ఇవ్వండి
కారులో కాలిపోయి చనిపోయిన ముస్లీం యువకులు దొంగలు అని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే ఇద్దరు దొంగలు అని అర్థ అవుతోందని రాజకీయ ప్రయోజనాల కోసం జంట హత్యల కేసును భజరంగ్ దళ్ మీద వేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మండిపడ్డారు. గురుగ్రామ్ లో విలేకరులతో మాట్లాడిన విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఈ జంట హత్యల కేసును సీబీఐకి అప్పగించాలని, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం కోసం హిందూద సంఘాల మీద ఆరోపణలు చేస్తున్నారని సురేంద్ర జైన్ మండిపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications