ఈద్గా మైదానంలో ఎన్నికల ప్రచారం, తిరగబడిన ఓటర్లు, జారుకున్న లీడర్ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశం చిక్కినా దానికి సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లీడర్ రంజాన్ పండుగ సందర్బంగాఈద్గా మైదనాంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లి చివాట్లు తిని అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు.
చిక్కమగళూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హెచ్.డి, తమ్మయ్యకు ఆ పార్టీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చింది. శనివారం రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు. ముస్లీం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హెచ్.డి. తమ్మన్న ఈద్గా మైదానంలోకి వెళ్లారు.

తనకు ఓటు వేసి గెలిపించాలని, ముస్లీం సోదరుల సమస్యలు పరిష్కరించడానికి తాను ప్రయత్నిస్తానని తమ్మయ్య ముస్లీం సోదరులకు చెప్పారు. ఆ సందర్బంలో ముస్లీం సోదరులలోని ఓ వర్గం ఈద్గా మైదానంలో నుంచి బయటకు వెళ్లిపోవాలని తమ్మయ్యకు తేల్చి చెప్పారు. మరో వర్గంలోని ముస్లీంలు తమ్మయ్య ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని అన్నారు.

ఆ సమయంలో ముస్లీం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మయ్యల మధ్య వాగ్వివాదం జరిగింది. తరువాత తమ్మయ్యను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లీం సోదరులు నినాదాలు చేశారు. అక్కడ ముస్లీం సోదరుల మధ్య రెండు వర్గాలు కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇరు వర్గాల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.
పరిస్థితి విషమించడంతో తమ్మయ్య అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. ఇంతకాలం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి వెంట ఉన్న తమ్మయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టిక్కెట్ సంపాధించుకున్నారు. తమ్మయ్యకు టిక్కెట్ ఇవ్వకూడదని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేసినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం తమ్మయ్యకే టిక్కెట్ ఇవ్వడంతో స్థానిక ముస్లీం సోదరులు మండిపడుతున్నారు. తమ్మయ్యను ఓడిస్తామని కొందరు ముస్లీం మత పెద్దలు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయోమయంలో పడిపోయింది.












Click it and Unblock the Notifications