ఇలాంటి నేతలు వద్దు: ములాయంపై నిర్భయ పేరెంట్స్

తనని తాను ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న ములాయం సింగ్ యాదవ్ లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. దేశంలో ఇలాంటి నాయకులు ఉన్నందనే మహిళల భద్రత దిగజారిపోయిందని నిర్భయ తండ్రి వాపోయారు. ఇటువంటి నాయకులను అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.
ఢిల్లీలో డిసెంబర్ 16, 2012న 23ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపర్చడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనతోనే ఆ యువతికి నిర్భయ పేరు పెట్టి నిర్భయ చట్టం తెచ్చి అత్యాచార దోషులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ ఎన్నికల ప్రచార సభలో గురువారం ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష వేసే చట్టాన్ని తాము మార్చేస్తామని ఆయన అన్నారు. అంతేగాక అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయకూడదని ఆయన అన్నారు. కుర్రాళ్లు తప్పులు చేస్తారని ఆయన అన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపై న్యాయపరమైన చర్యకు సంబంధించిన నిబంధన ఉండాలని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications