అమెరికా పర్యాటకురాలిపై రేప్ యత్నం: డ్రైవర్ అరెస్ట్
ముజాఫర్‌నగర్/భువనేశ్వర్: మన దేశానికి పర్యటనకు వచ్చిన ఓ అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారానికి యత్నించిన టాక్సీ డ్రైవర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై చోటు చేసుకుందని ముజాఫర్‌నగర్ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ నుంచి రిషికేష్‌కు బాధిత పర్యాటకురాలు ఓ టాక్సీలో బయల్దేరింది. కాగా, భోజనం కోసమని మార్గమధ్యలో కారును ఆపిన డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి యంత్నించాడు. అయితే ఆమె అతని బారి నుంచి తప్పించుకుని మరో వాహనంలో రిషికేశ్‌కు చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాలించిన పోలీసులు, నిందితుడు సమయ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

అత్తమామల హత్య: కానిస్టేబుల్ ఆత్మహత్య
భువనేశ్వర్: కుటుంబ కలహాల కారణంగా ఓ కానిస్టేబుల్ తన అత్తామామ, బావ మరిదితోపాటో ఇద్దరు బంధువులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అత్తామామలతోపాటు మరో ముగ్గురు బంధువులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఆ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్‌లో మంగళవారం చోటు చేసుకుంది.
కుటుంబ తగాదాలే ఈ ఘటనకు కారణమని ఐజి యశ్వంత్ వెల్లడించారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ నరేంద్ర కందప్పన్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications