భర్త దుశ్చర్య: భార్యను చంపి పొలంలో పాతిపెట్టాడు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. అతను భార్యను చంపి శవాన్ని పొలంలో పాతిపెట్టాడు. అనుమానం రాకుండా పొలం దున్నడానికి ముందు శవాన్ని పాతిపెట్టాడు.
ఆ మహిళ ప్రమీలా దేవి శవం బుధవారంనాడు పోలీసులు కనిపెట్టారు. ఇది వరకట్నం హత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఏడాది క్రితం దక్షిణ్ గ్రామానికి చెందిన లాల్ బాబూరామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇది వరకట్నం హత్యగా అనుమానిస్తున్నట్లు సరైయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉపేంద్ర కుమార్ చెప్పారు.

రామ్ ప్రమీలను చంపి శవాన్ని పొలానికి తీసుకుని వెళ్లి సమాధి చేశాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత పొలాన్ని దున్నాడని, దానివల్ల అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.
గ్రామానికి చెందిన కొంత మంది సమాచారం ఇవ్వడంతో తాము సంఘటనా స్థలానికి వెళ్లామని, సమాధి చేసిన శవాన్ని చూశామని, వెలికి తీశామని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రామ్, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications