పన్నీర్ కు పప్పు చారు, చిన్నమ్మకు చిప్పకూడు: సెల్వం గూటికి ఎమ్మెల్యేలు

చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్లిన తరువాత ఆమె శిభిరంలోని ఎమ్మెల్యేలు చీలిపోతున్నారు. ఇప్పుడు గంటకు ఒకరు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా మంగళవారం అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చారు.

మంగళవారం మద్యాహ్నం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యే నటరాజ్ మీడియాతో మాట్లాడుతూ జయలలిత తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఒక్కరే ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పారు. తనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం నాకయత్వంలో పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

Mylapore MLA Natraj extended his support to O. Panneerselvam today

ఇదే సమయంలో పన్నీర్ సెల్వం అనుచరులు మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలని ప్రయత్నించిన శశికళకు దేవుడు సరైన శిక్ష వేశాడని అన్నారు.

గోల్డన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వస్తే దాదాపుగా అందరూ పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. ఇప్పుడు చిన్నమ్మకు చిప్పకూడు, పన్నీర్ కు పప్పన్నం, పప్పు చారు మిగిలిందని ఆయన వర్గీయులు అంటున్నారు. మంగళవారం ఇద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం గూటికి చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+