స్వచ్చభారత్: దేశంలో మైసూరు ఫస్ట్ (ఫోటోలు)
మైసూరు: భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలు కని ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వచ్చభారత్ అమలు చేసే నగరాలలో దక్షిణ భారతదేశంలోని సాంసృతిక నగరం మైసూరు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. టాప్ టెన్ స్థానాలలో కర్ణాటక నాలుగు స్థానాలు దక్కించుకుని రికార్డు సృష్టించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత జిల్లా అయిన మైసూరు నెంబర్ వన్ స్థానంలో నిలబడటం విశేషం. భారతదేశంలోని 476 నగరాలలో స్వచ్చభారత్ కర్యాక్రమం ఏ విదంగా నిర్వహించారు అని కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. కేంద్రం సూచించిన అన్ని నియమాలు పాటిస్తున్నారా అని పరిశీలించారు.
ఒక లక్ష జనాభాకు పైగా ఉన్న నగరాలలో స్వచ్చభారత్ కార్యక్రమం అమలు పూర్తి వివరాలు సేకరించారు. అందులో మైసూరు నగరం మొదటి స్థానం దక్కించుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ డీఎంసీ)కి 16వ ర్యాంకు దక్కింది. మున్సిపల్ కార్పొషన్ ఆఫ్ ఢిల్లీకి 398వ ర్యాంకు దక్కింది.

సాంసృతిక నగరం
మైసూరు నగరానికి సాంసృతిక నగరం అనే పేరు ఉంది. ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికులతో పాటు అధికారులు ఎక్కువ శ్రద్ద చూపించారు. ప్రపంచ దేశాలలో మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

నాలుగు ర్యాంకులు
స్వచ్చభారత్ కార్యక్రమం అమలులో మైసూరు నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. తరువాత టాప్ టెన్ లోని మూడు ర్యాంకులను కర్ణాటక సొంతం చేసుకునింది. ఐదవ స్థానంలో హాసన్, ఆరవ స్థానంలో మండ్య, 7వ స్థానంలో బెంగళూరు నగరం సొంతం చేసుకున్నాయి.

టాప్ 10 నగరాలు
1.మైసూరు, 2. తిరుచురాపల్లి, 3. నవీ ముంబై, 4. కొచ్చి, 5. హాసన్, 6. మండ్య,7. బెంగళూరు, 8.తిరువనంతపురం, 9.హలిసవార్, 10. గాంగ్ టక్.

టాప్ 100 నగరాలలో
టాప్ 100 నగరాలలో పశ్చిమ బెంగాల్ 25 ర్యాంకులు దక్కించుకుంది. పాట్నాకు 429వ ర్యాంకు వచ్చింది.

ఈ రాష్ట్రాలకు ఇన్ని ర్యాంకులు
ఉత్తర ప్రదేశ్ 61, పశ్చిమ బెంగాల్ 60, మహారాష్ట్ర 43, గుజరాత్ 30, మధ్యప్రదేశ్ 32, ఆంధ్రప్రదేశ్ 30, తమిళనాడు 29, రాజస్థాన్ 28, బీహార్ 27, కర్ణాటక 26, హర్యానా 20, పంజాబ్ 16, తెలంగాణ 11, ఒడిశా 10, జార్ఖండ్ 10,చత్తిస్ ఘడ్ 9 ర్యాంకులు సంపాధించుకున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రారంభించిన స్వచ్చభారత్ కార్యక్రమంలో అమలు చెయ్యడంలో వీరు శ్రద్ద చూపించారు. టాప్ టెన్ లో ఏకంగా నాలుగు ర్యాంకులు కొట్టేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications