గాలి జనార్దన్ రెడ్డి ఒకే దెబ్బకు మూడుపిట్టలు, రిటైడ్ జడ్జికి గాలం, సీఎం సిద్దూకు సినిమా!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు, మాజీ ఎంపీ, రిటైడ్ న్యాయమూర్తి ఎన్.వై. గోపాలకృష్ణకు సీఎం సిద్దరామయ్య మొండి చెయ్యి ఇవ్వడంతో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎన్.వై. గోపాలకృష్ణకు బీజేపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకోవడానికి గాలి జనార్దన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు గాలి జనార్దన్ రెడ్ది చక్రం తిప్పుతున్నారు.

  మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించిన జనం
  సిట్టింగ్ ఎమ్మెల్యే

  సిట్టింగ్ ఎమ్మెల్యే

  చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరుకు చెందిన రిటైడ్ న్యాయమూర్తి ఎన్.వై. గోపాలకృష్ణ ఆ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2014లొ జరిగిన ఉప ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్.వై. గోపాలకృష్ణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  హ్యాండ్ ఇచ్చిన సీఎం సిద్దూ

  హ్యాండ్ ఇచ్చిన సీఎం సిద్దూ

  బళ్లారి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎన్.వై. గోపాలకృష్ణకు 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సీఎం సిద్దరామయ్య అవకాశం ఇవ్వలేదు. ఈ దెబ్బతో ఎన్.వై. గోపాలకృష్ణ, ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  కాంగ్రెస్ ప్లాన్ కు రివర్స్

  కాంగ్రెస్ ప్లాన్ కు రివర్స్

  బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి బరిలోదిగారు. స్థానిక శాసన సభ్యుడు ఎస్. తిప్పేస్వామి బి. శ్రీరాములును ఓడిస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యే తిప్పేస్వామిని బెంగళూరులోని తన ఇంటికి పిలిపించుకుని చర్చలు జరిపారు.

  గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ

  గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ

  శ్రీరాములు మీద తిరుగుబాటు చేసిన తిప్పేస్వామిని మంత్రి డీకే. శివకుమార్ ఇంటికి పిలిపించుకుని చర్చలు జరపడంతో గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణను బెంగళూరులోని తన ఇంటికి పిలిపించుకున్న గాలి జనార్దన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

  బీజేపీ టిక్కెట్

  బీజేపీ టిక్కెట్

  కూడ్లగి (ఎస్సీ) నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై ఎన్.వై. గోపాలకృష్ణను పోటీ చేయించాలని గాలి జనార్దన్ రెడ్డి ప్లాన్ వేశారు. తనకు పోటీ చెయ్యడానికి నియోజక వర్గం లేకుండా చేసిన సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీకి తగినబుద్ది చెప్పాలని ఎన్.వై. గోపాలకృష్ణ, ఆయన మద్దతుదారులు సిద్దం అయ్యారు.

  గాలి మాస్టర్ ప్లాన్

  గాలి మాస్టర్ ప్లాన్

  ఇప్పటికే తన మద్దతుదారులు అందరికీ టిక్కెట్లు ఇప్పించుకున్న గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులను చేరదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఈ సారి ఓడించాలని గాలి జనార్దన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు నిర్ణయించారని తెలిసింది.

  ఒకే దెబ్బకు మూడుపిట్టలు

  ఒకే దెబ్బకు మూడుపిట్టలు

  మాళకాల్మూరుకు చెందిన ఎన్.వై. గోపాలకృష్ణకు కూడ్లగిలో బీజేపీ టిక్కెట్ తో పోటి చేయించి అక్కడ గెలిపించుకుంటే ఆయన మద్దతు దారులు మాళకాల్మూరులో బి. శ్రీరాములుకు, బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో సణ్ణ ఫకీరప్పకు మద్దతుగా ఓట్లు వేస్తారని, ఈ దెబ్బతో మూడు నియోజక వర్గాల్లో బీజేపీ గెలుస్తోందని గాలి జనార్దన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Karnataka Elections: The loyal, former MP of Congress and the retired judge N.Y. Gopalakrishna and his family members decided to join BJP and to contest in the Kudligi ST reservation constituency.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి