Delhi Survey: ఢిల్లీ పోరులో దళితులు, ఆదివాసీలు ఎటు ? తాజా సర్వే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల దృష్టీ నెలకొంది. దీనికి కారణం వరుసగా మూడుసార్లు ఢిల్లీని గెలిచిన ఆప్ తో కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖాముఖీ తలపడుతుండటమే. ఈ పోరులో ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉన్నారనే దానిపై ఇప్పటికే పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తాజాగా దళితులు, ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య నాక్ డార్ తన సర్వేను ప్రకటించింది.
దళితుల, ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య అంచనాల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల ఓటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకేనని తేలిపోయింది. దాదాపు 35 నియోజకవర్గాల్లో వీరి మద్దతు ఆప్ కు ఆధిక్యాన్ని కట్టబెడుతున్నట్లు సర్వే తెలిపింది.ఢిల్లీ వ్యాప్తంగా 6256 మంది అభిప్రాయాలను ఈ సర్వేకు ఉపయోగించారు. ఇందులో 2574 మంది మహిళలు ఉన్నారు. ఆప్ కు 35 సీట్లలోనూ, బీజేపీకి 28 సీట్లలోనూ ఆధిక్యం లభించబోతుందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు మరో 7 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తేల్చారు.

ఈసారి జరిగే ఢిల్లీ ఎన్నికల్లో 44 శాతం మంది దళితులు ఆప్ కే ఓటేయబోతున్నట్లు సర్వే నివేదికలో తెలిపారు. బీజేపీకి 32 శాతం, కాంగ్రెస్ కు మరో 21 శాతం మంది దళితులు అండగా నిలవబోతున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికే దళితులు మొగ్గు చూపుతున్నట్లు దళిత, ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య తెలిపింది. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నా కేజ్రివాల్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్నట్లు సర్వే వెల్లడించింది.












Click it and Unblock the Notifications