సాధారణ పౌరులపై కాల్పులు విచారకరం: కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశం: జవాన్ దుర్మరణం
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన పట్ల భారత సైన్యం స్పందించింది. ఈ కాల్పుల ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఈ ఉదంతాన్ని దురదృష్టకరమైన ఘటనగా వ్యాఖ్యానించింది. ఈ కాల్పుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్పుల అనంతరం స్థానికులు సైనిక బలగాలపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. వాహనాలను తగులబెట్టారు. అక్కడి పరిస్థితులు అదుపు తప్పాయి. నాగాలాండ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది.

నాగా, ఉల్ఫాలకు పట్టు ఉన్న జిల్లా..
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని థిరు, ఒటింగ్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (కే), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) వంటి కొన్ని వేర్పాటువాద గ్రూపులకు గట్టిపట్టు ఉన్న జిల్లా ఇది. ప్రస్తుతం హార్న్‌బిల్ ఉత్సవాలు అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఈ హార్న్‌బిల్ వేడుకలను నిర్వహిస్తుంటుంది నాగాలాండ్ ప్రబుత్వం. పలువురు ప్రముఖులు దీనికి హాజరవుతుంటారు. ఇప్పటికే చాలామంది మోన్ జిల్లాకు చేరుకున్నారు.

స్థానికులను మిలిటెంట్లుగా భావించి..
దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్యాన్ని మోహరింపజేశారక్కడ. ఈ వేడుకలను భగ్నం చేయడానికి, దాడులకు పాల్పడటానికి అవకాశం ఉందంటూ పక్కా సమాచారం అందడంతో జవాన్లు క్యూంబింగ్ నిర్వహించారు. అదే సమయంలో ఒటింగ్ వద్ద గల బొగ్గు గనుల్లో పని చేసే స్థానిక యువకులు.. తమ విధులను ముగించుకుని మినీ ట్రక్‌లో ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో థిరు గ్రామం వద్ద భద్రత సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. మిలిటెంట్లుగా భావించి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది.

జవాన్ మరణం..
సంఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఈ ఘటన పట్ల ఆర్మీ అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాల్పుల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో ఓ జవాన్ మరణించినట్లు తెలిపారు. ఈ ఉదంతం మొత్తంపైనా అత్యున్నత స్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

కాల్పులు బాధాకరం..
థిరు-ఒటింగ్ మార్గమధ్యలో చోటు చేసుకున్న కాల్పులు.. అవాంఛనీయమైనవని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. అలా జరిగి ఉండకూడదని చెప్పారు. తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వివరించారు. కాల్పుల అనంతరం చెలరేగిన హింసలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, ఒకరు మరణించారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Recommended Video

ప్రభుత్వం తరఫున సిట్ దర్యాప్తు..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నెఫియో రియో స్పందించారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రామీణులపై కాల్పులు జరపడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. ఇది దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications