మరో భారీ పేలుడు.. 17 మంది మృతి..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ పేలుడు సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. 17 మంది మృతి చెందారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 30 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి పోయినట్లు తెలిపారు.

ఇటీవల కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో బాణాసంచా కార్మాగారంలో పేలుడు ఘటన మరువక ముందే మరో షాకింగ్ జరిగింది. నాగ్‌పూర్ సమీపంలోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో తాజాగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పేలుడు ధాటికి భవనం పూర్తిగా కూలిపోయింది. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Nagpur Explosion Horror 17 Lives Lost in Huge Blast Maharashtra nagpur Mourns Massive Tragedy

ఈ మేరకు ప్రస్తుతం పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫ్యాక్టరీలో గనుల పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం అవసరమైన పారిశ్రామిక పేలుళ్లతోపాటు డిటోనేటర్లు, అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తారు. అయితే డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌ లో ఏదైనా సాంకేతిక లోపం లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరం స్పష్టం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+