పిచ్చాస్పుత్రిలో నగ్నంగా రోగులు : బెంగాల్ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ : పిచ్చాసుపత్రిలో రోగుల ధీనావస్థపై ఓ మీడియా ఛానెల్ ప్రసారం చేసిన దృశ్యాలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సదరు మీడియా ఛానెల్ ప్రసారం చేసిన ఆ కథనంలో.. ఆసుపత్రిలోని రోగులంతా అపరిశుభ్రంగా ఉన్న నేల మీద నగ్నంగా పడుకుని ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది మానవ హక్కుల కమిషన్.

రోజుల తరబడి స్నానం చేయకుండా.. భారీగా పెరిగిన జుట్టుతో.. చిక్కిశల్యమైన శరీరాలతో రోగులు అవస్థ పడుతుండడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా.. ఓ ఎన్జీవో సంస్థ బర్హంపూర్ లో ఉన్న మెంటల్ ఆసుపత్రిని సందర్శించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Naked patients at mental hospital: Rights panel sends notice to WB govt

బర్హంపూర్ లోని ఈస్ట్ జోన్ పరిధిలో పనిచేస్తోన్న దామోదర్ సరంగీ అనే అధికారిని 8 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించింది కమిషన్. కాగా, ఈ విషయంపై స్పందించడానికి మెంటల్ ఆసుపత్రి సూపరిండెంట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలోని ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఈ వార్తలను ఖండించినట్లుగా సమాచారం.

అగస్టు 17వ తేదీన మీడియాలో ప్రసారమైన కథనం ప్రకారం.. బర్హంపూర్ లో ఉన్న మెంటల్ ఆసుపత్రిలో మొత్తం 430 మంది మెంటల్ పేషెంట్స్ వసతుల లేమితో కాలం వెళ్లదీస్తున్నట్లుగా తెలిసింది. ఆసుపత్రిలోని టాయ్ లెట్లు అసలు ఉపయోగించడానికి ఏమాత్రం వీలు లేని పరిస్థితుల్లో ఉండగా.. ఆసుపత్రి నిండా దుర్గంధం వ్యాపించి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+