వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 మంది విద్యార్దులతో నలందా షురూ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీహార్: ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం ఈ రోజు పునః ప్రారంభమైంది. 800 సంవత్సరాల తర్వాత మళ్లీ నలందా విశ్వవిద్యాలయంలో క్లాసులు మొదలయ్యాయి. బీహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో 455 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో సోమవారం నుండి ప్రారంభమైంది. ప్రస్తుతానికి చరిత్ర, పర్యావరణం రెండు విభాగాల్లో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం తరగతులు రాజ్‌గిర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి తరగతుల్ని ప్రారంభిస్తున్నా లాంఛనంగా సెప్టెంబర్ 14న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదగా ప్రారంభ వేడుకను నిర్వహింపజేస్తామని ఉప కులపతి గోపా సభర్వాల్ తెలిపారు. విశ్వవిద్యాలయం వేర్వేరు స్కూళ్లలో ప్రవేశాల కోసం వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారిలో 15 మందికే సీట్లు ఇచ్చారు.

నలందా యూనివర్సిటీకి చెందిన సొంత క్యాంపస్‌లో ఫిబ్రవరి 2015లో క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాజ్‌గిర్‌లో ఉన్న తాతగట్ హోటల్‌లో 40 రూమ్‌లను ప్రోఫెసర్లు, విద్యార్దులు కోసం బుక్ చేశారు. ఐదుగురు విద్యార్దినుల కోసం ప్రత్యేకంగా హోటల్‌లో ఒక ప్లోర్‌ను తీసుకున్నారు.

ఇప్పుడు యూనివర్సిటీలో 11 అధ్యాపక సభ్యులు, 15 మంది విద్యార్దులు ఉన్నారు. వీరిలో మగ్గురు బీహార్‌కి చెందిన వారు కావడం విశేషం. ఆరో శతాబ్దంలో నలందా యూనివర్సిటీ చాలా ప్రత్యేకత ఉంది. గుప్తుల కాలంలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయాన్ని టర్కీ సైన్యం 1193లో కొల్లగొట్టి ధ్వంసం చేయడంతో యూనివర్సిటీ మూత పడింది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో బీహార్ పర్యటనలో చేసిన సూచనతో ఈ వర్సిటీని తిరిగి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికీ యూనివర్సిటీకి సంబంధించి బిల్డింగ్ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా, సింగపూర్, థాయ్ లాండ్, ఆస్టేలియా వంటి దేశాలు విరాళాలు ఇచ్చాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం రాబోయే పదేళ్ల కాలంలో రూ. 2700 కోట్లు సాయాన్ని అందిస్తుంది.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

నలందా యూనివర్సిటీకి చెందిన సొంత క్యాంపస్‌లో ఫిబ్రవరి 2015లో క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

రాజ్‌గిర్‌లో ఉన్న తాతగట్ హోటల్‌లో 40 రూమ్‌లను ప్రోఫెసర్లు, విద్యార్దులు కోసం బుక్ చేశారు. ఐదుగురు విద్యార్దినుల కోసం ప్రత్యేకంగా హోటల్‌లో ఒక ప్లోర్‌ను తీసుకున్నారు.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

ఇప్పుడు యూనివర్సిటీలో 11 అధ్యాపక సభ్యులు, 15 మంది విద్యార్దులు ఉన్నారు. వీరిలో మగ్గురు బీహార్‌కి చెందిన వారు కావడం విశేషం.

నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

ఆరో శతాబ్దంలో నలందా యూనివర్సిటీ చాలా ప్రత్యేకత ఉంది. గుప్తుల కాలంలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయాన్ని టర్కీ సైన్యం 1193లో కొల్లగొట్టి ధ్వంసం చేయడంతో యూనివర్సిటీ మూత పడింది.

నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

విశ్వవిద్యాలయం వేర్వేరు స్కూళ్లలో ప్రవేశాల కోసం వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారిలో 15 మందికే సీట్లు ఇచ్చారు.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో బీహార్ పర్యటనలో చేసిన సూచనతో ఈ వర్సిటీని తిరిగి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికీ యూనివర్సిటీకి సంబంధించి బిల్డింగ్ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

చైనా, సింగపూర్, థాయ్ లాండ్, ఆస్టేలియా వంటి దేశాలు విరాళాలు ఇచ్చాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం రాబోయే పదేళ్ల కాలంలో రూ. 2700 కోట్లు సాయాన్ని అందిస్తుంది.

 నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

చైనా, సింగపూర్, థాయ్ లాండ్, ఆస్టేలియా వంటి దేశాలు విరాళాలు ఇచ్చాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం రాబోయే పదేళ్ల కాలంలో రూ. 2700 కోట్లు సాయాన్ని అందిస్తుంది.

నలందా పునః ప్రారంభం

నలందా పునః ప్రారంభం

ప్రస్తుతానికి తరగతుల్ని ప్రారంభిస్తున్నా లాంఛనంగా సెప్టెంబర్ 14న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదగా ప్రారంభ వేడుకను నిర్వహింపజేస్తామని ఉప కులపతి గోపా సభర్వాల్ తెలిపారు.

English summary
The much-awaited Nalanda University starts functioning from Monday with two schools, 15 students and 11 faculty members. Of the students, five are women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X